పల్లె పల్లెకు ఝాన్సమ్మ

దయలేని ఎర్రబెల్లి కి 3 సార్లు అవకాశం ఇచ్చారు

By Venkat
On
 పల్లె పల్లెకు ఝాన్సమ్మ

ప్రజాసంకల్ప యాత్ర లో హనుమాండ్ల ఝాన్సిరెడ్డి

3 వ రోజు గడపగడపకు కాంగ్రెస్ - పల్లె పల్లెకు ఝాన్సమ్మ

యలేని ఎర్రబెల్లి కి3 సార్లు అవకాశం ఇచ్చారు

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి

ప్రజాసంకల్ప యాత్ర లో హనుమాండ్ల ఘాన్సీరెడ్డి

Read More ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

IMG-20231009-WA0283న్యూస్ ఇండియా తెలుగు :ప్రతినిధి
జనగామ/కొడకండ్ల:

కొడ కండ్ల మండలం మైదం చెరువు,గిర్ని తండ,బాలు నాయక్ తండ,పెంకుల తండా గ్రామంలో 3 వ రోజు గడపగడపకు కాంగ్రెస్ - పల్లె పల్లెకు ఝాన్సమ్మ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు.గ్రామంలో మహిళలు మంగళ హారతులతో,కోలాట ఆటపాటలతో ఘన స్వాగతం పలికగా,అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు,మన ఉద్యోగాలు మనకి వస్తాయనుకుంటే, కెసిఆర్ కుటుంబంలోనే ఉద్యోగాలు వచ్చాయి తప్పుతే,ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలేదని,కెసిఆర్ కుటుంబం లబ్ధి పొందింది తప్పితే, తెలంగాణలో ఏ ఒక్కరూ కూడా లబ్ధి పొందలేదన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా,దళితులని మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ అని,పాలకుర్తి నియోజకవర్గంలో  15 సంవత్సరాలుగా దాయలేని దయాకర్ కు అధికారం ఇచ్చారని ఈ సారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని కోరారు.బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లారా ఇక మీ బెదిరింపు ఆటలు సాగవని,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు మీకు అండగా నేను ఉంటానన్నారు.తమ సొంత డబ్బులతో నిర్మించుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు, నిర్మించుకున్న వారికి డబ్బులు కూడా ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీ కార్డులను వెంటనే అమలు చేస్తాం అని,పాలకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల వలె పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ,గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ నాయక్,సిద్దు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హెమని నాయక్,హరి చందర్,మండల ఎస్టి సెల్ అధ్యక్షులు భాస్కర్,రవి,యూత్ కాంగ్రెస్ నాయకులు గోపాల్,ఎన్.ఎస్.యూ.ఐ నియోజకవర్గ అధ్యక్షులు హర గోపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News