PK Tention : కాంగ్రెస్‌లో పీకే టెన్షన్
PK Tention :కాంగ్రెస్ టీఆర్‌ఎస్ ఓ పీకే …అన్నట్లుగా నడుస్తున్న రాజకీయ చదరంగంపై పొలిటికల్ సర్కిల్స్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ ఎవరితో ఉన్నారన్న సందేహం తెలంగాణ రాజకీయాలను వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ హైకమాండ్‌తో నాలుగు సార్లు సమావేశమైన ప్రశాంత్ కిషోర్ .. ఇప్పుడు సడన్‌గా హైదరాబాద్‌లో ప్రత్యక్షం అవడం, జీఎం కేసీఆర్‌తో రెండు రోజుల పాటు జరిపిన చర్చలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో అలెర్ట్ […]
PK Tention :కాంగ్రెస్ టీఆర్‌ఎస్ ఓ పీకే …అన్నట్లుగా నడుస్తున్న రాజకీయ చదరంగంపై పొలిటికల్ సర్కిల్స్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ ఎవరితో ఉన్నారన్న సందేహం తెలంగాణ రాజకీయాలను వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ హైకమాండ్‌తో నాలుగు సార్లు సమావేశమైన ప్రశాంత్ కిషోర్ .. ఇప్పుడు సడన్‌గా హైదరాబాద్‌లో ప్రత్యక్షం అవడం, జీఎం కేసీఆర్‌తో రెండు రోజుల పాటు జరిపిన చర్చలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో అలెర్ట్ అయిన టీకాంగ్రెస్ నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు.
పీకే ఇష్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు హస్తం నేతలు. గులాబీ బాస్ చేస్తున్న పొలిటికల్ డ్రామాలో ఇదో పార్ట్ అంటున్నారు. కేసీఆర్‌తో డీల్ రద్దు కోసమే పీకే.. ప్రగతి భవన్ భేటీ అంటూ స్పష్టత ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చేరిక దాదాపు ఖాయమే అంటున్నాయి హస్తం వర్గాలు. పీకే చేరికకు సోనియా,రాహుల్ గాంధీ, ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లో చేరే ముందే ఇతర పార్టీలతో పనిచేసెందుకు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం పీకేకు సుచించిందట.
ఓటమి భయంతో ఉన్న కేసీఆర్..పీకే సర్దుబాటు సమావేశాలను కూడా లీకులు ఇచ్చి కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నారని విమర్శిస్తున్నారు. త్వరలో ప్రశంత్‌కిషోర్ దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి పీకే రెండురోజుల తెలంగాణ ఎపిసోడ్ చర్చనీయాంశమవుతోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List