తొర్రూర్ రాజీవ్ గృకల్ప కాలనీలో ఘనంగా సద్దల బతుకమ్మ వేడుకలు..
స్థానిక కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ అని స్థానిక కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్ అన్నారు.

ఎల్బీనగర్, అక్టోబర్ 23 (న్యూస్ ఇండియా తెలుగు): తీరొక్క పూలతో తీర్చిదిద్ది ఆటపాటలు, కోలాటాలతో అవధుల్లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ అని తుర్కయంజల్ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్ అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూర్ రాజీవ్ గృహకల్ప కాలనీలో అంగరంగ వైభవంగా సద్దల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన పూల పండుగ సందర్భంగా ఆయన తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా తొర్రూర్ రాజీవ్ గృహకల్ప కాలనీలో మహిళలు సద్దుల బతుకమ్మ పేర్చి సెంటర్ వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు వి. నరసమ్మ, మానస, జయమ్మ, స్ఫూర్తి, మమత, మనోరమ, సౌమ్య, అంజలి, శృతి, మణెమ్మ, మల్లేశ్వరి, బాలమణి, అమ్ములు, కాలనీ మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
Comment List