OU Congress Vs TRS: ఉస్మానియాలో రాహుల్‌ గాంధీ పర్యటన

On

OU Congress Vs TRS: ఉస్మానియాలో రాహుల్‌ గాంధీ పర్యటనకు ముందే టీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూనివర్సిటీలో రాహుల్‌ పర్యటనను ఆపడం ఎవరి తరమూ కాదని కాంగ్రెస్‌ చెబుతుంటే.. ఎలాగైనా రాహుల్‌ రాకను అడ్డుకుంటామంటోంది టీఆర్‌ఎస్‌ విద్యార్ధి విభాగం. ఓయూలో రాహుల్‌ గాంధీకి అనుమతి నిరాకరించడంపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అనుమతి కోసం ఇవాళ మరోసారి ఓయూకి వెళ్తున్నారు రేవంత్‌రెడ్డి. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఓయూకు వస్తుంటే… రాష్ట్ర […]

OU Congress Vs TRS: ఉస్మానియాలో రాహుల్‌ గాంధీ పర్యటనకు ముందే టీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూనివర్సిటీలో రాహుల్‌ పర్యటనను ఆపడం ఎవరి తరమూ కాదని కాంగ్రెస్‌ చెబుతుంటే.. ఎలాగైనా రాహుల్‌ రాకను అడ్డుకుంటామంటోంది టీఆర్‌ఎస్‌ విద్యార్ధి విభాగం.

ఓయూలో రాహుల్‌ గాంధీకి అనుమతి నిరాకరించడంపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అనుమతి కోసం ఇవాళ మరోసారి ఓయూకి వెళ్తున్నారు రేవంత్‌రెడ్డి. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఓయూకు వస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వదని మండిపడ్డారు. టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలను వీసీ కాపాడుతున్నారని ఆరోపించారు. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులు వీసీతో మాట్లాడి పర్మిషన్ ఇవ్వాలని అడిగితే.. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని మండిపడ్డారు.

చంచల్‌గూడ జైలులోని ఎన్ఎస్యూఐ విద్యార్ధి నాయకులను కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజనీకుమార్ యాదవ్, సంపత్ కుమార్‌తో కలిసి వెళ్లి పరామర్శించారు రేవంత్‌రెడ్డి. ఈ నెల 7న జైల్లో ఉన్న తమ విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీకి పర్మిషన్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్ శివకుమార్ గౌడ్‌ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News