హోంగార్డ్ చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు నిత్యవసర సరుకుల పంపిణీ
మార్కాపురం న్యూస్ ఇండియా
సబ్కా మాలిక్ ఏక్ హై అందరి దేవుడు ఒక్కడే అనే నినాదంతో మానవసేవే మాధవ సేవగా భావించి నిరుపేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మార్కాపురం పట్టణానికి చెందిన "కొండమ్మ" అనే మహిళకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో కాలు విరిగి ఏ పని చేసుకోలేక సరైన జీవనాధారం లేక వచ్చే పింఛన్ మీద ఆధారపడి బ్రతుకుతున్న వైనం.కనుక కొండమ్మ జీవనం ఇబ్బందిగా మారడంతో తక్షణమే స్పందించి పసుపులేటి అల్లూరయ్య, కాసుల ప్రవీణ్ కుమార్ దాతల సహకారంతో బియ్యము నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. ఈ మహోన్నతమైన సేవా కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన అల్లూరయ్య ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కొండమ్మ కాలు ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నది కావున ఎవరైనా దాతలు కొండమ్మ కాలు ఆపరేషన్కు ఎవరైనా ఆర్థిక సహాయం అందించగలరని ఆశిస్తునట్లు హోంగార్డు చెనుపల్లి కాశయ్య తెలిపారు.ఎవరైనా దాతలు కొండమ్మకు ఆర్థిక సహాయం అందచేయాలన్నచో 9603580633 నెంబర్ ని సంప్రదించవలసినదిగా హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య తెలియజేసినారు.
Comment List