పాయకరావుపేటలో ఎవరు?

ఎమ్మెల్యేల్ని మార్చే వ్యూహంలో జగన్

On
పాయకరావుపేటలో ఎవరు?

వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్

ycpgolla7

తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మార్చకపోతే వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉండటంతో.. 40 నుంచి యాభై 50 మంది ఎమ్మెల్యేల్ని మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

స్థానికంగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మార్చకపోవడంతోనే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మార్చేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. దీంతో మొట్ట మొదట పడే వికెట్ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుదే. ఆయనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండటం.. పార్టీ కేడర్ కూడా ఆయనకు సహకరించకపోవడంతో ఆయన్ను మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. గొల్ల బాబూరావు ప్లేస్ లో ఆ టికెట్.. క్లీన్ ఇమేజ్ ఉన్న ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అమ్మాజీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమ్మాజీ అయితే విజయం చాలా సులువు అవుతుందనే ధీమాలో వైసీపీ హైకమాండ్ ఉంది.

Views: 59

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్