కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

On
కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలIMG-20231222-WA0075

భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 21 :కోవిడ్ పట్ల అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయంలో ని కలెక్టర్ చాంబర్ లో   కోవిడ్  ముందస్తు నియంత్రణ చర్యలపై  వైద్యశాఖ అధికారులతో నియంత్రణ చర్యలపై సమీక్షించారు. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో మే నెల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. ఇప్పుడు కొవిడ్ లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రు ల్లో  కొవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొవిడ్ నియంత్రణకు డ్రగ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్క్ లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు.ఈ  సమావేశంలో జిల్లా వైద్య అధికారి శిరీష మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Views: 15
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు