ఐఎన్టియుసి కేంద్ర నాయకుని దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం 

On
ఐఎన్టియుసి కేంద్ర నాయకుని దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం 

ఐఎన్టియుసి కేంద్ర నాయకుని దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం IMG-20240126-WA0422

 యూనియన్ లో పదవులు ఇచ్చే  అర్హత లేని నాయకుడు 

లెటర్ ప్యాడ్, వాట్సప్ తో పదవులు చెల్లవు

సభ్యత్వం లేని వ్యక్తిని నాయకుని ఎలా చేస్తారు

Read More ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...

 ఆగ్రహం వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు కార్యకర్తలు 

 కార్యకర్తలను అడ్డుకొని  సంముదయించిన ఏరియా వైస్ ప్రెసిడెంట్,  జనరల్ సెక్రెటరీ,  కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్

 కొత్తగూడెం జనవరి 26: ఐ ఎన్ టియు సి కొత్తగూడెం  ఆఫీస్ వద్ద  ఐఎన్టియుసి కార్యకర్తలు శుక్రవారం కేంద్ర నాయకుడు సెక్రెటరీ జనరల్   జన ప్రసాద్ దిష్టిబొమ్మ దాహనం కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ..యూనియన్ గెలిసి నెల రోజులు పూర్తి అయింది. కొత్తగా కార్పొరేట్, ఏరియాల లో కమిటీలను ఏర్పాటు చేసుకొని పదవులు కేటాయించాల్సింది  ఉండగా, తాజాగా గురువారం యూనియన్ లో గతంలో ఉన్న పదవులు అన్ని రద్దు చేస్తున్నట్లుగా సెక్రెటరీ జనరల్   బి.జనక ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేసి,తక్షణమే ఇక్కడున్న నాయకులను ఎవరిని కూడా సంప్రదించకుండా తనకు ఇష్టం వచ్చిన వారికి  తాయిలాలకు అమ్ముడుపోయి, అసలు సెక్రటరీ  జనరల్   అనే పదవి అనేది ఉండదు.ఏదో యూనియన్లో ఒక పదవి వాళ్లు సొంతంగా ఇచ్చారు. దాన్ని ఆసరా చేసుకుని చలామణి అవుతూ. యూనియన్ కష్ట కాలంలో పట్టించుకోకుండా, ఆఖరికి మొన్నజరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కనీసం ప్రచారానికి కూడా రాకుండా,ఎన్నికల మెటీరియల్ ఖర్చు కూడా ఫండ్  ఇవ్వకుండా, సొంత ఖర్చులతో యూనియన్ ని నాలుగు ఏరియాలలో  గెలిపించుకున్నాక, గెలిచాక  కార్మికులని కలవడానికి కూడా రాని నాయకుడు. రేపు ఎలక్షన్ అనగా అంతకు ముందు రోజు టీబీజీకేస్ నుంచి  వచ్చి యూనియన్లో చేరుతామని కండువా మాత్రమే కప్పుకొని, యూనియన్ సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు  యూనియన్ పగ్గాలు ఎలా ఇస్తారని యూనియన్ కార్యకర్తలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే  కమిటీలు వేసి అందరి ఆమోదంతోనే నాయకులు ఎన్నుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Views: 29
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా