మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

On
మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

IMG-20240205-WA0690
ఇన్సెట్లో మృతుడు సతీష్

మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం మండలంలోని వెలువర్తి గ్రామానికి చెందిన పసల సతీష్ (24), పసల భాగ్యరేఖకు వీరు ఇరువురికి ఐదు సంవత్సరాల క్రిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల కాలంలో భర్త సతీష్ మద్యానికి బానిస కావడంతో మద్యం సేవించవద్దని కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించడం జరిగింది. అట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల నాలుగవ తేదీన సతీష్ భాగ్యరేఖతో పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి భావి వద్దకువెళ్ళాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో అతనికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సుమారు 6 గంటల ప్రాంతాన ఆమె మామ అయిన బాలస్వామికి తెలుపగా అతను పొలానికి చూడగా సతీష్ అక్కడ ఉన్న బాదం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతలో అక్కడ ఉన్న బత్తిని బాలస్వామి మాదాసు మరియన్న మాదాసు జోసెఫ్ మృతదేహాన్ని కిందకు దించి ఇంటికి తీసుకొచ్చారు. దీనితో ఫిర్యాదురాలు భాగ్యరేఖ తన భర్త మృతి పై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపింది. ఇట్టి కేసుపై ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్, ఏఎస్ఐ శ్యాంసుందర్ రెడ్డి లు తెలియజేశారు.

Views: 34

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 08వ వార్డులో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి cr ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వినూత్నమైన ప్రచార శైలితో...
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సత్యభామ ప్రచారం