విద్యార్థుల నమూనా పర్యావరణ జిల్లా ప్రజా పరిషత్

పర్యావరణ హితంగా మేడారం జాతర...

By Ramesh
On
విద్యార్థుల నమూనా పర్యావరణ జిల్లా ప్రజా పరిషత్

న్యూస్ ఇండియా తెలుగు, ఫిబ్రవరి 12 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలోని కోడవటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే దేవతలను గౌరవించే గిరిజన పండుగ సమ్మక్క సరలమ్మ జాతరను  (మేడారం జాతర) పురస్కరించుకుని "నమూనా పర్యావరణ జిల్లా పరిషత్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో పర్యావరణహితంగా మేడారం జాతరలో ప్లాస్టిక్ రహితంగా,ఘన వ్యర్ధాలను నిర్దేశించిన ప్రాంతంలో వేయాలని,బయోటాయిలెట్స్ లను వినియోగించాలని,ఆ ప్రాంతంలోని నీటి వనరులను కలుషితం చేయకుండా చూడాలని,వాహిని రద్ది తగ్గించేందుకు సురక్షితమైన ఆర్టిసి బస్సులోనే జాతరకు వెళ్ళాలని విద్యార్థులచే తీర్మాణం చేయించినైనది.ఈ కార్యక్రమంలో కలెక్టర్ గా మల్లిక, జెడ్పీ చైర్మన్ గా భవాణి,సిఈఓగా వైష్ణవి, మినిష్టర్ సీతక్క గా కావేరి, మినిస్టర్ కొండ సురేఖ గా సౌమ్య, జెడ్పీటీసీ సభ్యులుగా ఎనిమిదవ తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.యాదగిరి, కార్యక్రమానిర్వాహణ చేసిన శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, జయశ్రీ, నరేష్,అపరంజీ,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..IMG-20240212-WA1084

Views: 174
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News