జగన్ ప్రచారంలో పక్కన ఉన్నఈ ఇద్దరు ఎవరో తెలుసా?
నేటి రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్టర్
నేటి రాజకీయాల్లో ఓ మాస్ లీడర్
అప్పుడు స్లీవ్స్ మడతపెట్టి నేను సిద్ధం అన్నాడు
ఇప్పుడు మేమంతా సిద్ధంతో సినిమా చూపించనున్నాడు
ఏపీలో ఎన్నికల సమరభేరి మోగించారు సీఎం జగన్. అయితే ఇడుపులపాయకు బయల్దేరేముందు తాడేపల్లి ఇంటి దగ్గర హడావుడి నెలకొంది. ఈ సందర్భంగా జగన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన వారిలో ఒక ఇద్దరు ప్రత్యేకంగా కనపడ్డారు. జోగి రమేష్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపితే ఆయన పక్కనే ఉన్నారు చేతులు జోడించి నమస్కరించారు. అయితే వారిద్దరూ ఎవరనే ప్రశ్న చాలా మందిలో నెలకొంది. వారిలో బ్లాక్ షర్ట్ తో ఉన్న వ్యక్తి ఐప్యాక్ రిషి రాజ్ సింగ్ అయితే.. మరొకరు మాత్రం అవినాశ్. వీరిద్దరూ పొలిటికల్ స్ట్రాటజిస్టులు. ఐ ప్యాక్ ఏపీ ఆపరేషన్స్ హెడ్ గా రిషీ రాజ్ సింగ్ ఉంటే.. అవినాశ్ ఇరగవరపు కూడా వైసీపీ కోసం చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఆఫ్ సీఎంగా విధులు నిర్వహిస్తూ సీఎం జగన్ కు పొలిటికల్ స్ట్రాటజీలు ఇస్తున్నారు. అవినాష్ HCLలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత 2013లో ఆంధ్రప్రదేశ్‌లో YSR కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించాడు
2014లో, అవినాష్ US వెళ్లి అక్కడ డౌగ్ డ్యూసీ అనే అభ్యర్థికి ప్రచారం చేశాడు..
డౌగ్ డ్యూసీ గవర్నర్ అయిన తర్వాత, అతను అరిజోనా రిపబ్లికన్ పార్టీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు, అక్కడ అతను తన విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు వ్యూహాత్మక ఆలోచనల ద్వారా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 2016లో రాష్ట్రాన్ని గెలుచుకోవడంలో పార్టీకి సహాయం చేశాడు. 2016 నాటికి, అతను వివిధ రాజకీయ పార్టీలతో నిమగ్నమై ఉన్నాడు మరియు సమర్థవంతమైన రాజకీయ ప్రచారాన్ని రూపొందించడంలో వారికి సహాయం చేశాడు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List