బతుకమ్మ పండుగ

On

Batukamma Festival : భారతదేశం పండుగలకు పుట్టినిల్లు.తెలంగాణాలో మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే పర్వదినం ఈబతుకమ్మ పండుగ.తెలంగాణా లో ఈ పండుగను వెయ్యి సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారు. ఈపండుగనే సద్దుల పండుగ అని ,గౌరీపండుగ అని, పూల పండుగ అని కూడ పిలుస్తారు.ఈ పండుగ ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఈపండుగను జరుపుకుంటారు.తంగేడు,బంతి ,చేమంతి ,గునుగు,నంది వర్ధనం వంటి పువ్వులతో బతుకమ్మను పూజిస్తారు. ఈ పూలన్నీ ఆరోగ్య ప్రదాయాలు కావడం […]

Batukamma Festival : భారతదేశం పండుగలకు పుట్టినిల్లు.తెలంగాణాలో మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే పర్వదినం ఈబతుకమ్మ పండుగ.తెలంగాణా లో ఈ పండుగను వెయ్యి సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారు.
ఈపండుగనే సద్దుల పండుగ అని ,గౌరీపండుగ అని, పూల పండుగ అని కూడ పిలుస్తారు.ఈ పండుగ ప్రకృతి సౌందర్యానికి ప్రతీక.
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఈపండుగను జరుపుకుంటారు.తంగేడు,బంతి ,చేమంతి ,గునుగు,నంది వర్ధనం వంటి పువ్వులతో బతుకమ్మను పూజిస్తారు.
ఈ పూలన్నీ ఆరోగ్య ప్రదాయాలు కావడం మరో విశేషం.

బతుకమ్మను రంగు రంగుల పువ్వులతో పేర్చి మద్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పూజిస్తారు.పువ్వులతో అందంగా అలంకరించిన బతుకమ్మ చుట్టూ చిన్నా ,పెద్ద తేడా లేకుండా స్త్రీ లందరూ
చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఎంతో ఉల్లాసంగా వేడుక జరుపుకుంటారు.
బతుకమ్మకు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం సమర్పిస్తారు.నువ్వులు ,బియ్యం పిండి,నూకలు,బెల్లం,అటుకులు ,ముద్దపప్పు,పాలు,అట్లు,పెరుగన్నం,పులిహోర,కొబ్బెర అన్నం,మొక్క జొన్నలు,సజ్జలు,
శనగలు,మినుములు ,పెసర్లు,గోదుమలు వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు.

బతుకమ్మ కథలు

చోళరాజు ధర్మాంగదుడు ,అతని భార్య సత్యవతికి వంద మంది పుత్రులండేవారు,వారంతా ఒక యుద్ధంలో చనిపోతారు .ఈ సంఘటనతో కలత చెందిన ఆ దంపతులు లక్ష్మీదేవిని పూజిస్తారు.లక్ష్మీదేవిని పూజించి
ఒక ఆడబిడ్డను ప్రసాదించమని కోరారు .లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుట్టింది . మహర్షులు ఆమెను చిరకాలం బతుకమ్మా అని దీవిస్తారు.వాళ్ళ ఆశీర్వాద ఫలం వల్ల ఆమె బ్రతికింది.అలా బ్రతికిన
ఆమె కథే బతుకమ్మ కథ. నాటి నుండే ఈ పండుగ నాడు ఆడపిల్లలను లక్ష్మీ దేవిగా భావిస్తారు.

మరో కథ

Read More పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..

ఒకానొక ఊరిలోని దంపతులకు పుట్టిన ప్రతి సంతానం పుట్టినట్లే చనిపోతుంటే ఆ దంపతులు పార్వతీ మాతను పూజిస్తారు.పార్వతీ మాత కరుణతో వారికి ఒక ఆడుబిడ్డ కలిగింది.ఆమెను వారు
బతుకమ్మా అని ఆశీర్వదించి ,బతుకమ్మ అని పేరు పెట్టారు .బతుకు అమ్మా అని ఆశీర్వదించారు కనుకే బతికింది కాబట్టి ఆమెకు బతుకమ్మా అని పేరు పెట్టారు.

బతుకమ్మ పండుగ ఆడపడుచుల పండుగ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను భక్తితో పూజించి చివరి రోజు బతుకమ్మను జలం లో నిమజ్జనం చేస్తారు.
నిమజ్జనం అయ్యాక మలీద ను అందరికీ పంచి పెడతారు .(మలీద అనగా చక్కెర ,రొట్టెతో చేసిన వంటకం).

బతుకమ్మ పండుగను ఆంధ్రరాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని పల్నాడు గ్రామాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు