*ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొర్రూరు ప్రిన్సిపాల్ ను తక్షణమే బదిలీ చేయాలి.*

*ప్రైవేటు కళాశాలలకు తొత్తుగా మారిన ప్రిన్సిపాల్ రాములు.* *సి వై ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాలోతు సురేష్ బాబు.*

*ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొర్రూరు ప్రిన్సిపాల్ ను తక్షణమే బదిలీ చేయాలి.*

IMG-20240416-WA0068 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బదిలీపై వచ్చిన నూతన ప్రిన్సిపల్ రాములు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి  విద్యని అందనియకుండా వారిని చదువుకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని సి వై ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాలోతు సురేష్ బాబు ఆరోపించారు. ఒకటి నాలుగు ఆరవ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్ష ఫీజులను కట్టించుకోకుండా స్కాలర్షిప్లు రాలేదని సాకు చెప్పి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించాకే సెమిస్టర్ పరీక్ష ఫీజులు కట్టించుకుంటామని బెదిరించడం సరైన చర్య కాదని అన్నారు. ఎంతో నమ్మకంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత విద్య అందుతుందన్న నమ్మకంతో వచ్చిన విద్యార్థులను ఫీజుల పేరుతో వేధించటం రాబోవు రోజులలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లను తగ్గించడమే వారి లక్ష్యమని అన్నారు. పరీక్ష ఫీజులు కట్టించుకోమని విద్యార్థులు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కళాశాల ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నీ బదిలీ చేయాలని లేకుంటే కళాశాల మూతపడిపోయే పరిస్థితి, కార్పొరేట్ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు విద్యార్థులు వెళ్లే అవకాశం ఉందని అన్నారు.

Views: 82
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య