నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రక్తదానం ప్రాముఖ్యత హెచ్.ఐ.వి / ఎయిడ్స్ నిర్మూలన పై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం

On
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రక్తదానం ప్రాముఖ్యత హెచ్.ఐ.వి / ఎయిడ్స్ నిర్మూలన పై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం

ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు అకౌంటెంట్ మరియు  ప్రోగ్రామ్స్అ ధికారి కమరతపు భానుచందర్ సహకారంతో కె.సి.ఆర్ నగర్ యూత్ క్లబ్ వారు  హెచ్.ఐ.వి / ఎయిడ్స్ లో భాగంగా రక్తదానం ప్రాముఖ్యత మరియు ఎయిడ్స్ నిర్మూలన పై ఖమ్మంలో కొన్ని డివిజన్స్ 50 ఇల్లు  డోర్ టు డోర్ తిరిగి అవగాహన ఇవ్వడం జరిగింది. "హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పై అవగాహన పెంపొదిద్దాం, హెచ్.ఐ.వి రహిత సమాజాన్ని సాధిద్దాం" అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. తగు జాగ్రత్తలు పాటించకపోతే హెచ్.ఐ.వి / ఎయిడ్స్ ఎవరికైనా సోకవచ్చు. మనలో చాలామందికి తమ హెచ్.ఐ.వి స్థితి తెలియదు. హెచ్.ఐ.వి నాలుగు విధాలుగా మాత్రమే సోకుతుంది. అసురక్షిత లైంగిక సంబంధాల ద్వారా, కలుషితమైన సూదులు - సిరంజీల ద్వారా, కలుషితమైన రక్తాన్ని మరొక్కరికి ఎక్కించడం ద్వారా, హెచ్.ఐ.వి సోకిన తల్లి నుండి పొట్టబోయే బిడ్డకు అని వివరించి మరియు "రక్తదానం చేద్దాం నాలుగు నిండు ప్రాణాలను కాపాడుదాం" అనే అంశాన్ని కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు, కె.సి.ఆర్ నగర్ యూత్ క్లబ్ అవగాహన ఇవ్వడం జరిగింది.

Views: 160
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 09, న్యూస్ ఇండియా : రాష్ట్రంలోని గ్రామపంచాయతీ భవనం నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పవర్...
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
విద్య, వైద్య విషయంలో ఎల్లపుడు జిల్లా నాయకత్వం అందుబాటులో ఉంటుంది*
ఘనంగా 'సామూహిక వరలక్ష్మీ వ్రతాలు'
అప్రమత్తంగా ఉండండి... సమన్వయంతో వ్యవహరించండి