బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత

• బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు • ఆపరేషన్ ముస్కాన్- XI ద్వారా 126 మంది బాల కార్మికులకు విముక్తి

On
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 01, న్యూస్ ఇండియా : బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అని జిల్లా ఎస్పీ తెలిపారు. బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకున్న 81 మంది పై కేసులు నమోదు చేశామని తెలిపారు. బాల కార్మికులకు విముక్తి కల్పించడానికి, ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ పేర్లతో రెండు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా బాలకార్మికులకు విముక్తి కల్పించి, పాఠశాలలకు పంపించడం జరుగుతుందని అన్నారు. గల నెల రోజులుగా అనగా జూలై 1 నుండి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-XI లో భాగంగా వివిధ శాఖలు పోలీసు శాఖ, చైల్డ్ లేబర్, సి.డబ్ల్యూ.సి, డి.సి.పి.యు. విద్యాశాఖ మరియు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ మొదలైన శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి, ఆపరేషన్ ముస్కాన్-XI ను విజయవంతం చేయడం జరిగిందని, ఆపరేషన్ ముస్కాన్-XI టీం ను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఆపరేషన్ ముస్కాన్-XI లో భాగంగా ఈ సంవత్సరం మొత్తం 126 మంది బాల కార్మికులను రక్షించడం జరిగింది. వీరిలో 119-మంది బాలురు, 07-మంది బాలికలు ఉన్నారని, బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకున్న యజమానులపై 81 కేసులు నమోదు చేయడం జరిగిందని, అట్టి వ్యక్తులపై చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకున్నా, వెట్టిచాకిరికి గురి చేసినా, బలవంతంగా బిక్షాటన చేయించినా, పశువుల కాపరులుగా, కిరాణం దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫామ్ లు ఇతర ప్రదేశాలలోనూ పని చేయించడం, చట్టరీత్యా నేరం, ఎవరైనా పై చర్యలకు పాల్పడితే అట్టి వ్యక్తులపై చట్టరిత్య క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. బాల కార్మికులు ఎవరైన కనిపించినట్లయితే చైల్డ్ లైన్ నెంబర్ 1098 లేదా డైల్ 100 కు గాని సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ను విజయవంతం చేసిన, వివిధ శాఖలకు చెందిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.WhatsApp Image 2025-08-01 at 5.32.06 PM

Views: 54
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?