కాంగ్రెస్, బిఆర్ఎస్ తెలంగాణను దోపిడీ చేసి ధ్వంసం చేసిన పార్టీలు

బిజెపి నాయకులు (రాష్ట్ర మాజీ మంత్రి) ఈటెల రాజేందర్....బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రామ్మోహన్ రెడ్డి

కాంగ్రెస్, బిఆర్ఎస్ తెలంగాణను దోపిడీ చేసి ధ్వంసం చేసిన పార్టీలు

*కాంగ్రెస్, బిఆర్ఎస్ తెలంగాణను దోపిడీ చేసి ధ్వంసం చేసిన పార్టీలు*

*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రామ్మోహన్ రెడ్డి*

గురువారం రోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తొర్రూరు పట్టణంలోని కంటాయపాలెం రోడ్డులోని వెంకటేశ్వర కళ్యాణ మండపం లో పాలకుర్తి నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రాన్ని  ధ్వంసం చేసిన కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలని ఈ నెల 27 న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొదటి ప్రాధాన్యత ఓటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి వేసి అధిక మెజార్టీతో పట్టబద్రులు గెలిపించాలని అందర్నీ కోరారు.. 

*ప్రపంచంలో అన్ని రంగాలలో భారతదేశాన్ని రెండవ స్థానంలో నిలబెట్టిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ*

Read More సమాజాన్ని శాంతివైపు నడిపించిన దివ్య చరితుడు "మహమ్మద్ ప్రవక్త"...!

*పట్టబద్రులు విజ్ఞానవంతుణ్ణి అయిన ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి*

Read More సమయపాలన పాటించని ఎపిజిబి బ్యాంకు మేనేజర్ రంగప్ప...?

*బిజెపి నాయకులు (రాష్ట్ర మాజీ మంత్రి) ఈటెల రాజేందర్*

Read More నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న యువ యూత్

ఈరోజు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచారంలో వచ్చిన నేను అందరికీ విన్నవించుకుంటున్న విషయం భారతీయ జనతా పార్టీ నిబద్దతగల పార్టీ నిబద్ధతగల నాయకులను నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  భారతదేశాన్ని అన్ని రంగాలలో ఎంతో శ్రమించి రెండో స్థానంలో నిలబెట్టిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడాలి. ఎంతో పెద్ద విపత్తు కరోనాకాలంలో రెండు డోసుల వ్యాక్సిన్ ఒక బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇప్పించి ప్రజల ప్రాణాలు కాపాడుకున్నారు. అన్ని రకాల సాంకేతిక, ఎలక్ట్రానిక్ రంగాలలో కానీ రోడ్ల విషయంలో గాని రైల్వే విషయంలో గాని దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టినారన్నారు. రక్షణ రంగంలో ఎనలేని కీర్తిని ప్రదర్శించండం వలన ఇవ్వాల దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో ప్రజలను నట్టేట ముంచి ఆగం తీసేయాలి ఎద్దేవా చేశారు టిఆర్ఎస్ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రజలకు రుణమాఫీ చేస్తానని చెప్పి లక్ష రూపాయలు రుణమాఫీ చేసినట్టే చేసి వడ్డీకి సరిపోని విధంగా ప్రజల మీద భారం మోపారని ఎద్దేవా చేశారు. 
 ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ప్రజలను మోసం చేయడమే కాకుండా ఆరు నెలల నుండి కాలయాపన రామ్ రామ్ చేస్తూ వస్తున్నారని ఆరు గ్యారెంటీ ల పేరుతో మహిళలను ప్రజలను ఎంతగానో మోసం చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడతారని ఎద్దేవా చేశారు. రైతులను బాగు చేయలేదు విద్యావంతులను బాగు చేయలేదు. జర్నలిస్టులను బాగు చేయలేదు ఎవ్వరికీ న్యాయం చేయని పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలని ఎద్దేవ చేశారు.
అందుకే మన దేశ ప్రధాని చూసి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రాం మోహన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్, ప్రభాకర్,కసిరెడ్డి భాస్కర్ రెడ్డి,తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా నాయకులు రంగు రాములు,కొలుపుల శంకర్,దొంగరి మహేందర్,సుంకరనేని కోటేశ్వర్,రచ్చ కుమార్, సాయిని ఝాన్సీ, మెడపల్లి సోమన్న, సాయిని ఝాన్సీ, బొచ్చు సురేష్, వడ్లకొండ రవి,బొమ్మనబోయిన సుధాకర్,అలిసేరి రవిబాబు, కస్తూరి పులేందర్, ఉపేందర్, సత్తెన్న,గట్టు రాంబాబు, పైండ్ల రాజేష్, గడల శేఖర్, గట్ల భరత్, కాగు నవీన్, జలగం రవి, గంధం రాజు, పప్పుశెట్టి సంతోష్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Views: 48
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News