ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు.

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి

ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు.

IMG_20240605_070003

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వెలువడిన ఫలితాల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య భారీ విజయం సాధించడంతో మంగళవారం రాత్రి తొర్రూరు డివిజన్ కేంద్రంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ... కడియం కావ్యకు రెండు లక్షల పైగా మెజార్టీ అందించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. అదేవిధంగా రేపు వెలువడే వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా ఇదేవిధంగా రాబోతున్నాయని అన్నారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 40,000 భారీ మెజారిటీ అందించడం, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News