ఆంజనేయునికి ఏయే పదార్ధాలతో అభిషేకాలు చేస్తే.. ఏయే ఫలితాలు కలుగుతాయంటే..!

On

 chaitu2-transformed

న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక పెద్ద వంగర ప్రతినిధి 
గుండెపుడి చైతన్య శర్మ

రామాయణంలో హనుమంతుడికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. శ్రీ రామ భక్తుడిగా… సీతా రాముల దాసునిగా.. భక్త రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో హిందువులతో పూజలను అందుకుంటున్న దేవుడు. మనదేశంలో ఎక్కడ చూసినా అంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, .ఇలా అనేక పేర్లతో పూజలను అందుకుంటున్న హనుమాన్ కు ప్రీతి కరమైన రోజు మంగళవారం. ఈరోజు ఆంజనేయునికి ఏయే పదార్ధాలతో అభిషేకాలు చేస్తే.. ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..!
తేనె – తేజస్సువృధ్ధి చెందుతుంది ఆవుపాలతో – సర్వసౌభాగ్యాలు చేకూరుతాయి. ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి చేకూరుతుంది. ఆవునెయ్యి -ఐశ్వర్యం విబూధితో – సర్వపాపాలు నశిస్తాయి పుష్పోదకం – భూలాభాన్ని కలుగజేస్తుంది బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి పంచదార – దు:ఖాలు నశిస్తాయి చెరకురసం – ధనం వృధ్ధి చెందుతుంది కొబ్బరినీళ్ళతో – సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి. గరికనీటితో – పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహనాదులను తిరిగి పొందగలుగుతారు. అన్నంతో అభిషేకంతో – సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది. నవరత్నజలాభిషేకం – ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది మామిడిపండ్లరసంతో – చర్మ వ్యాధులు నశిస్తాయి. పసుపునీటితో – సకలశుభాలు, సౌభాగ్యదాయకం నువ్వులనూనెతో అభిషేకిస్తే – అపమృత్యు నివారణ. సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం ద్రాక్షారసంతో – జయం కలుగుతుంది కస్తూరిజలాభిషేకంచేస్తే – చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన* కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
జై శ్రీమన్నారాయణ,వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీకొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల...
కన్నడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో   *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!
నూతన ఎస్సై ని సన్మానించిన ఇమామ్ సాబ్ లు‌‌..
ఘనంగా HRCCI తెలంగాణ రాష్ట్ర సదస్సు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...
పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!