సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వైద్యులు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి...
-జనగామ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్...
న్యూస్ ఇండియా తెలుగు, ఆగష్టు 16 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
వైద్యులు పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ ఆదేశించారు.శుక్రవారం రోజున అదనపు కలెక్టర్ బచ్చన్నపేట మండలంలో పర్యటించి, మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సంబంధిత వైద్య అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్లు మానస, సృజన, ప్రసన్న కృష్ణ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బచ్చన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్స్ పర్యవేక్షకులు శ్రీనివాస్ ను ఆదేశించారు.అనంతరం మండలంలోని నారాయణపూర్ ను సందర్శించి డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న రోగిని పరామర్శించి, అధైర్యపడరాదని తప్పనిసరిగా వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.ఫీవర్ సర్వేపై వివరాలు అడిగి తెలుసుకుంటూ, వైద్యం కొరకు ప్రైవేట్ హాస్పటల్స్ కు వెళ్లిన వారి పాజిటివ్ రోగుల వివరాల ను తెప్పించుకుని పిహెచ్సి కి గాని, సబ్ సెంటర్ల కానీ అందజేయాలన్నారు. హాస్పిటల్ పరిసరాలు పరిశీలిస్తూ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.అదే మండలంలోని కస్తూర్భగాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. పాఠశాల గదిలో ఫ్యాన్లను పరిశీలిస్తూ,రెండు ఫ్యాన్లు ఉండడంతో అదనంగా మరో రెండు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.మండల నోడల్ అధికారులు వసతి గృహాలను నిరంతరం పరిశీలించాలని అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ అవసరమైన వారికి వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు.అదనపు కలెక్టర్ వెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పర్యవేక్షకులు శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, డి జి సి ఓ గౌసియా బేగం, మండల నోడల్ అధికారి వెంకటరెడ్డి, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు....
Comment List