పొంగులేటి పై ఈడి దాడులు బిజెపి బిఆర్ఎస్ లోపాయి కార ఒప్పందమే
ఈడీలతో కాంగ్రెస్ ను భయపెట్టలేరు
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) సెప్టెంబర్ 28: ఈడీలతో కాంగ్రెస్ ను భయపెట్టలేరని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డ లోని వారి నివాసంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై బిజెపి బిఆర్ఎస్ లోపాయి కారి ఒప్పందముతో జరిగిన ఈడి దాడులు రాజకీయ కక్ష సాధింపు అని అన్నారు. మంచి రాజకీయ భవిష్యత్తు , ప్రజల నాయకుడైన పొంగులేటి ఆదరణను ఓర్వలేకనే ఈడి దాడులు జరుగుతున్నాయి అన్నారు. పొంగులేటి కుమారుడు మరియు బంధువుల ఇండ్లపై 16 చోట్ల ఏకకాలంలో దాడు జరిపారని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందని, రాబోయే రోజుల్లో కచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ చంద్రశేఖర రావు , కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, కూచిపూడి జగన్, మాలోత్ కృష్ణ, అర్జున్ రావు, వెంకటరెడ్డి, ధర్మారావు, బలరాం, అరుణ్, పూణెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
.
Comment List