భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం

ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ,ఎస్పీ

On

పోలీసులకు ప్రతిరోజు ఒక యుద్ధమే

కొత్తగూడెం (న్యూస్ఇండియాబ్యూరోనరేష్) అక్టోబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురం నందు సోమవారం పోలీసు అమరవీరుల సంస్కరణ దినం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. పోలీసు గౌరవ వందనాలు స్వీకరించి ,పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ, కలెక్టర్ మాట్లాడుతూ .. 1959 అక్టోబర్ 21న అక్షయ్ చిన్ లో సిఆర్పిఎఫ్ జవాన్లు వీరేచితంగా పోరాడి పదిమంది మృతి చెందారని, అప్పుడు మనం చైనా నుంచి మన దేశాన్ని కాపాడుకున్నామని, ఆ సందర్భంగా 1960 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నామని తెలిపారు. సైన్యం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారని. వారి కష్టం వల్లనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో జిల్లాలో కూడా పోలీసులు వృత్తి రీత్యా అమరులవుతున్నారని, అలాగే గత 20, 30 సంవత్సరాలకు ఇప్పటికీ నక్సలిజం తగ్గిందని అన్నారు . గ్రాండ్స్ ,స్పెషల్ పార్టీ ఇతర సిబ్బంది సమిష్టి కృషితోనే నక్సలిని పారదోలేమని తెలిపారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 214 మంది అమరవీరులయ్యారని, దానిలో భద్రాద్రి జిల్లాలొని పూసుగుంపు బేస్ క్యాంప్ అసిస్టెంట్ కమాండర్ డీఎస్పీ ర్యాంకు అధికారి శేషగిరిరావు నక్సల్స్ అమర్చిన మందు పాత్ర పేలి మృతి చెందారని ఇది మన జిల్లాలో జరగడం బాధాకరమన్నారు. పోలీసులకు ప్రతిరోజు ఒక యుద్ధమే అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ,సిఐలు,ఎస్సైలు , గ్రాండ్స్ పోలీసులు,ఇతర ఉన్నతాధికారులు వివిధ విభాగాలు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Views: 76
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్! ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి మొదట ప్రమాదంలా కనిపించింది. కానీ దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. కాబోయే భార్య, ఆమె ప్రియుడు...
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?
ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?
లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా?