భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం

ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ,ఎస్పీ

On

పోలీసులకు ప్రతిరోజు ఒక యుద్ధమే

కొత్తగూడెం (న్యూస్ఇండియాబ్యూరోనరేష్) అక్టోబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురం నందు సోమవారం పోలీసు అమరవీరుల సంస్కరణ దినం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. పోలీసు గౌరవ వందనాలు స్వీకరించి ,పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ, కలెక్టర్ మాట్లాడుతూ .. 1959 అక్టోబర్ 21న అక్షయ్ చిన్ లో సిఆర్పిఎఫ్ జవాన్లు వీరేచితంగా పోరాడి పదిమంది మృతి చెందారని, అప్పుడు మనం చైనా నుంచి మన దేశాన్ని కాపాడుకున్నామని, ఆ సందర్భంగా 1960 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నామని తెలిపారు. సైన్యం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారని. వారి కష్టం వల్లనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో జిల్లాలో కూడా పోలీసులు వృత్తి రీత్యా అమరులవుతున్నారని, అలాగే గత 20, 30 సంవత్సరాలకు ఇప్పటికీ నక్సలిజం తగ్గిందని అన్నారు . గ్రాండ్స్ ,స్పెషల్ పార్టీ ఇతర సిబ్బంది సమిష్టి కృషితోనే నక్సలిని పారదోలేమని తెలిపారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 214 మంది అమరవీరులయ్యారని, దానిలో భద్రాద్రి జిల్లాలొని పూసుగుంపు బేస్ క్యాంప్ అసిస్టెంట్ కమాండర్ డీఎస్పీ ర్యాంకు అధికారి శేషగిరిరావు నక్సల్స్ అమర్చిన మందు పాత్ర పేలి మృతి చెందారని ఇది మన జిల్లాలో జరగడం బాధాకరమన్నారు. పోలీసులకు ప్రతిరోజు ఒక యుద్ధమే అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ,సిఐలు,ఎస్సైలు , గ్రాండ్స్ పోలీసులు,ఇతర ఉన్నతాధికారులు వివిధ విభాగాలు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Views: 62
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..