పోలీసు భర్తల కోసం రోడ్డుపై భార్యల పోరాటం

కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆరో బెటాలియన్ కానిస్టేబుల్ భార్యల ధర్నా

On
పోలీసు భర్తల కోసం రోడ్డుపై భార్యల పోరాటం

ఏ స్టేట్ ..ఏక్ పోలీసు విధానం అమలు చేయాలి

IMG20241026111343 నరేష్)అక్టోబర్ 26:కొత్తగూడెంలో  పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులురోడ్డెక్కారు. 6వబెటాలియన్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న భర్తల కోసం భార్యలు రోడ్డుపై బైఠాయించి శనివారం ధర్నాకు దిగారు. కొత్తగూడెం పాల కేంద్రం నుంచి సూపర్ బజార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వం వన్ పోలీస్ వన్ రూల్ ను అమలు చేయాలని, పోలీస్ డ్యూటీలో తమ భర్తలను వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు, కర్ణాటక పోలీసు విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేశారు. టీజీఎస్పీ హఠావో.. ఏక్ పోలీస్ బచావో అంటూ నినాదాలు చేశారు. పొరుగు రాష్ట్రాల్లోని పోలీస్ విధానాలను తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ భర్తలు 8 గంటలకు మించి బెటాలియన్ కానిస్టేబుళ్లకు డ్యూటీ వేస్తుండటాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు. నెలలో నాలుగు రోజులు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. తమ భర్తలతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వాపోయారు. తరచూ పోస్టింగులు మారుస్తూ ఉండటంతో పిల్లల చదువులకు ఇబ్బంది ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. తమ సమస్యలు పరిష్కారించాలని కోరారు. కొత్తగూడెం  ప్రధాన జాతీయ  రహదారిపై కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బెటాలియన్ పోలీసులకు ఐదేళ్ల పాటు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమ భర్తలు ఇంటికి దూరంగా ఉంటున్నారని.నెలలో నాలుగు రోజులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారని వాపోయారు. ఉద్యోగాల పేరుతో తమకు దూరం చేస్తున్నారని.ఇకనైనా ఒక రాష్ట్రం, ఒకే పోలీస్ విధానం అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు. 

Views: 75
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..