నిజాయితి ని చాటుకున్న: సివిల్ సప్లయ్ అధికారి డి.టి మాచన రఘునందన్...

బస్సులో రూ 50 వేలు  మరిచిపోయిన రైతు...గుర్తించి బాధితుడికి అందజేత..

On
నిజాయితి ని చాటుకున్న: సివిల్ సప్లయ్ అధికారి డి.టి మాచన రఘునందన్...

నిజాయితి ని చాటుకున్న:
సివిల్ సప్లయ్ అధికారి డి.టి మాచన రఘునందన్...

బస్సులో రూ 50 వేలు  మరిచిపోయిన రైతు...

గుర్తించి బాధితుడికి అందజేత..

IMG-20250222-WA0668
నిజాయతీ చాటుకున్న సివిల్ సప్లయ్ అధికారి డి.టీ మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 22, న్యూస్ ఇండియా ప్రతినిధి:- ఆర్టీసీ బస్సు లో డబ్బు ను పోగొట్టుకున్న రైతుకు దాన్ని తిరిగి అందజేసి నిజాయితీని చాటుకున్నారు సివిల్ సప్లయ్ అధికారి. విరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన మాచన రఘునందన్ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా.. విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి చింతపల్లి కి ఓ రైస్ మిల్లు తనిఖీ కోసం అర్జీసే బస్సు లో వస్తున్నారు. అదే బస్సు లో చింతపల్లి మండలానికి చెందిన ఓ రైతు ఐలయ్య కూడా వస్తున్నారు. బస్సు చింత పల్లి కి రాగానే సీట్లోంచి లేచి బస్సు దిగడానికి వెళ్తున్న ఐలయ్య తన డబ్బు పడిపోయిన విషయం గమనించలేదు.కంగారు, కంగారుగా బస్ దిగేశాడు.డబ్బు పడిపోయినా కూడా పట్టించుకోకుండా బస్ దిగి వెళ్తున్న సందర్భం లో డబ్బు కనపడక ఆందోళన కు గురయ్యాడు.. సివిల్ సప్లై డి.టి  రఘునందన్, ఐలయ్య కూర్చున్న సీటు కిందపడి ఉన్న ఆ డబ్బు తీసి, ఇదిగో నీ డబ్బు. జాగ్రత్త గా పెట్టుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు.ఐలయ్య కాస్త కుదుట పడ్డాక.అంత డబ్బు ఎక్కడివి ఎక్కడినుంచి తెస్తున్నావ్ అని అడిగితే.."బిడ్డ లగ్గం ఉంది, సిటి ల తెలిసిన వారి దగ్గర జాగ కాయితాలు ఉంచి తీసుకొచ్చిన సారూ.."అని ఐలయ్య బదులిచ్చాడు.
సార్.. పోయిన నా పైసలు తిరిగి ఇచ్చినవ్. ఓ వెయ్యి తీసుకో అని ఐలయ్య ప్రాధేయ పడగా.."నీ కు బీ డీ అలవాటు ఉంది, అది మానెయ్ చాలు" అంటూ ఆన తీసుకున్నాడు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి