రేషన్ "దందా" పై ఉక్కు పాదం...

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి మాచన రఘునందన్..

On
రేషన్

రేషన్ "దందా" పై ఉక్కు పాదం 

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి మాచన రఘునందన్

నల్గొండ జిల్లా,

IMG-20250220-WA0695
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి మాచన రఘునందన్..

ఫిబ్రవరి 26 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో డీలర్ల పాత్ర ఉంటే.. వారిపై కేసులు నమోదు చేయడమే గాక , వారి డీలర్ షిప్ రద్దు చేస్తానని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ తీవ్రంగా హెచ్చరించారు.బుధవారం నాడు రఘునందన్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ షిప్ అనేది ఓ భాధ్యత మాత్రమే గాక, గౌరవప్రదమైనదని రఘునందన్ స్పష్టం చేశారు. కాని రేషన్ బియ్యం దందా రుచి మరిగిన కొందరు డీలర్ల వల్ల ఇతర డీలర్లు కూడా అభాసు పాలౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లే అక్రమాలు చేస్తే ఆ..ఈశ్వరుడు కూడా కాపడలేడని, వారిని జైలు కు పంపడం ఖాయం అని రఘునందన్ హెచ్చరించారు.తాజాగా నిన్న "సాగర్" లో..డీలర్లు పట్టుబడటం ఇందుకు నిదర్శనం అన్నారు. ఇక ప్రతి చౌక దుకాణాన్ని క్షుణ్ణంగా  తనిఖీ చేయనున్నట్టు రఘునందన్ స్పష్టం చేశారు. రేషన్ బియ్యం దందా చేసే వారిపై పి డి యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని మాచన రఘునందన్ స్పష్టం చేశారు. చింతపల్లి పరిధి లో నమోదైన కేసులు,పట్టుబడ్డ వారి గురించి ఆరా తీశారు. రేషన్ దందా చేయడం కొందరికి అలవాటు గా మారిందని, వారి పై ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్టు రఘునందన్ స్పష్టం చేశారు.

Read More సంగారెడ్డిలో శ్రీచైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పండ్లు పంపిణీ.

Views: 13

About The Author

Post Comment

Comment List

Latest News