మానవత్వంతో అండగా నిలిచినా " ఆటోవాలా "..!

స్నేహితుడైనా ఆటో డ్రైవర్ కి తోటి డ్రైవర్లు నిత్యవసర సరుకులు, 11200/-రూ ఆర్థిక సహాయంతో చేయూత.

On
మానవత్వంతో అండగా నిలిచినా

- అనారోగ్యంతో మంచాన పడ్డ ముల్లా ముక్రి బాబు కుటుంబానికి తోడుగా నిలిచిన డ్రైవరన్నలు.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం మార్చి 16 :- అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితుడైనా ఆటో డ్రైవర్ కి మానవత్వంతో తోటి డ్రైవర్లు వారి వంతు ఆర్థిక సహాయంతో చేయూతనిచ్చారు. మండల కేంద్రమైన పెద్దకడుబూరులో ముల్లా ముక్రి బాబు అనే వ్యక్తి చాలా కాలంగా ఆటో నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. అయితే కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇల్లు చేరడం జరిగింది. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ముల్లా ముక్రి బాబు ప్రస్తుతం ఇంట్లో మంచానికే పరిమితం కావడంతో భార్య కూడా మంచాన పడ్డ భర్త మంచి చెడ్డలు చూడడానికి పరిమితమైంది. అయితే ప్రస్తుతం నలుగురు పిల్లలున్న ఆ కుటుంబం యొక్క జీవన పోషణ కొనసాగించుటకు కష్టతరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న తోటి ఆటో డ్రైవర్లు ముందడుగు వేసి అనారోగ్యంతో మంచాన ఉన్న స్నేహితుడైనా ముల్లా ముక్రి బాబు ఇంటికి వెళ్లి ఆప్యాయూత తో పలకరించి అధర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని, మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ఆ కుటుంబానికి నిత్యవసర సరుకులు మరియు 11200 రూ ఆర్థిక సహాయం చేసి తోటి స్నేహితుని కుటుంబానికి డ్రైవరన్నలు కొండంత అండగా నిలిచారు... ఇలాంటి దీనమైన పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయ సహకారంతో ఆదుకోవాలని ప్రజా ప్రతినిధులను పత్రిక ముఖనా వారు కోరారు... ఈ కార్యక్రమంలో ముల్లా ఉసెన్ సాబ్, ముల్లా మాబు, ముళ్ల బాషా, దయ్యల హాజరత్ వలి, బేగర దుబ్బన్న,దావీదు, యాసిన్, సూరీ, రంగస్వామి, జయరాం,వినీత్, పవన్, రాజు, వెంకటేష్, మహబూబ్ మరియు పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు.IMG_20250316_113450

Views: 103
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్