ప్రజావాణికి 63 దరఖాస్తులు

On
ప్రజావాణికి 63 దరఖాస్తులు

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 21, న్యూస్ ఇండియా : జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) చంద్రశేఖర్  సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 63  మంది దరఖాస్తుదారులు  తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. రెవెన్యూ శాఖ 35 , పౌరసరఫరాల శాఖ 02, సర్వే ల్యాండ్ 4, పంచాయతీ & పి టి విభాగం 3, పంచాయతీరాజ్ 2, డి.ఆర్.డి.ఓ 4, మున్సిపల్ 3, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3, వ్యవసాయ శాఖ 4, పశు సంవర్ధక శాఖ 3,  వచ్చాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజల ప్రధాన సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డీ.ఆర్‌.ఓ పద్మజ రాణి, ఏవో అంటోని సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-21 at 4.01.40 PM

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు