పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!

- ప్రజల గుండెల్లో మరుపురాని నేతగా వైయస్ఆర్ నిలిచిపోయారు...

On
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!

ఘనంగా దివంగత నేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు...

న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా / పెద్దకడుబూరు మండలం జూలై 08 :- పెద్దకడుబూరు మండలం లో మంగళవారం వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు కలిసి ఘనంగా వైయస్ఆర్ 76వ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. స్థానిక బస్టాండ్ ఆవరణంలోని వైఎస్సార్‌ విగ్రహాలకు, పార్టీ కార్యాలయాల్లోని చిత్రపటాలకు పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మరపురాని మహానేతను స్మరించుకుంటూ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పెద్దకడుబూరు మండలం వైసీపీ నేతలు కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రా రెడ్డి, నవీన్ రెడ్డి, విజేంద్ర రెడ్డి, శివరామి రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. క్రింది స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగిన మహానేత ఆయన. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన అందరి లాంటి ముఖ్యమంత్రి కాదు. స్వయంగా ప్రజాబలం కలిగిన నాయకుడు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్‌ అంటే నచ్చని ప్రభుత్వం వచ్చినా వాటిని పక్కన పెట్టలేకపోయారు. సుదీర్ఘమైన దూర దృష్టితో వైయస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పేదరికం వలన విద్య మధ్యలో ఆగకూడదని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారని, పేదవాడు కూడా ఉన్నత హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించకపోయినా రైతులకు ఉచిత విద్యుత్ అందించారని, నేడు ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ వస్తుందంటే అది వైయస్సార్ కృషి. ప్రజలకు ఏది అవసరమో అది గుర్తించి వాగ్దానం చేసి, అమలు చేసిన నాయకుడు వైయస్సార్ అని పేర్కొన్నారు. 2029 సంవత్సరంలో వచ్చే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే వైఎస్సార్ పాలన సాధ్యమవుతుందన్నారు... పేద ప్రజలకు అండగా తండ్రి బాటలో జగనన్న ఎప్పటికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే తపించే వ్యక్తి అని, ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి చేస్తూనే మరియు మరో వైపు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ పాలన చేసిన ప్రజా నాయకుడు జగన్ అన్నారు. కానీ అపద్దపు మాటలతో ఇప్పుడు అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ తో ప్రజలను మోసం చేసిందని, రాష్ట్ర అభివృద్ధని పూర్తిగా మరిచారాని అన్నారు. అయితే కూటమి ప్రజలకు చేసిన వెన్నుపోటు పై వైసీపీ పార్టీ తరుపున అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పై పోరాడుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే పెద్దకడుబూరు నుండి ఆదోని మరియు ఎమ్మిగనూరు పట్టణాలకు వెళ్ళే రహదారి గుంతలలో ఆగిన వర్షపు నీటిలో మండలం కూటమి నేతలు చేపలు పట్టడం జరిగిందని, అయితే ఇప్పుడు వారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా వారు చేపలు పట్టిన రహదారులు కనిపించడం లేదా అని దీటుగా ప్రశ్నించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, సుందరం,ఏసన్న, ప్రసాద్, అనిల్,రాజు, దిద్దికాటి లింగన్న, గూడు బాషా, శాంతిమూర్తి, ఈరన్న, దస్తగిరి, రామాంజి, ముని, జాము మూకయ్య, మరియు తదితరులు పాల్గొన్నారు...IMG_20250708_211201

Views: 119
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News