1100 గజాల పార్కు స్థలం 'కబ్జా'!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 25, న్యూస్ ఇండియా : సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని 34 వార్డ్ రాంచంద్ర రెడ్డి కాలనీ సర్వే నెంబర్ 403 లో ని లే అవుట్ నెంబర్ 18 / 91లోని దాదాపు 1100 గజాల పార్కు స్థలం 'కబ్జాకు గురి కాబడింది. పార్క్ స్థలాము ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి కాలనీ వాసుల ఫిర్యాదుచేసారు. సంగారెడ్డి పట్టణం లోని 34 వార్డ్, రాంచంద్ర రెడ్డి కాలనీ, సర్వే నెంబర్ 403, లోని లే అవుట్ నెంబర్ 18 / 91 లోని దాదాపు పదకొండు వందల గజలకు పైగా పార్కు స్థలం ‘ప్రైవేట్ వ్యక్తులు’ మల్కాపూర్ తోడల్ గూడెం 239 సర్వే నెంబర్ అనే తప్పుడు వివరాలతో ముసుగు వేసి కొంతమంది నిర్మాణలు చేసే ప్రయత్నం చేశారు. గతం లో కాలనీ వాసులు ఫిర్యాదు చేస్తే కమిషనర్ వచ్చి పనులు నిలిపి వేయడం జరిగింది. పార్క్ ఓపెన్ స్పేస్ హద్దు బందులు, బౌండ్రి ఫిక్స్ చేయడానికి కొలతలు తీసుకున్నారు, రిపోర్ట్ పెండింగ్ ఉంది. అప్పటి ‘టీపిఓ’ బదిలి అయ్యారని గత కొన్ని రోజులుగా మళ్ళీ నిర్మాణ పనులు మొదలు పెట్టారని తెలిసినది. వెంటనే సర్వే నెంబర్ 403 లోని లే అవుట్ పార్క్ స్థలాన్ని సర్వే చేయించి హద్దు బందులు నిర్దారించి పార్క్ స్థలం లో వెలసిన నిర్మాణాలు తొలగించి.. లే అవుట్ లోని పార్క్ స్థలము స్థానిక కాలనీ వాసుల సామాజిక అవసరాలకోసం వినియోగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి కాలనీ వాసులు ఎం విజయ, అశోక్, మెహమ్మద్ షఫీ, గోపాల్, భారతి, ఎం శ్రీధర్, ఫిర్యాదు చేసారు. ఇట్టి కార్యక్రమం లో అంబేద్కర్ సేవ సమితి అధ్యక్షులు కొండాపురం జగన్ తదితరులు పాల్గొన్నారు.
|
Comment List