ప్రజావాణి ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరించాలని 'కలెక్టర్ సూచన'
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 25, న్యూస్ ఇండియా : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 35 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డి ఆర్ ఓ పద్మజ రాణి లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Aug 2025 20:21:52
కొత్తగూడెం( న్యూస్ ఇండియాబ్యూరో నరేష్):యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని పట్టణ 3వ టౌన్ సిఐ కె. శివప్రసాద్ అన్నారు.పట్టణంలో పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు,కోచ్ షమీఉద్దీన్ జిమ్...
Comment List