యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీఐ శివప్రసాద్
కొత్తగూడెం( న్యూస్ ఇండియాబ్యూరో నరేష్):యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని పట్టణ 3వ టౌన్ సిఐ కె. శివప్రసాద్ అన్నారు.పట్టణంలో పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు,కోచ్ షమీఉద్దీన్ జిమ్ ప్రారంభించి 10వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ శివప్రసాద్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో వెళ్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని,ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దృఢంగా,ఆరోగ్యంగా ఉంటారన్నారు.మనం ఏదైతే లక్ష్యం నిర్దేశించుకుంటామో దాని ఫలితం కోసం మనమే కష్టపడాలని ప్రతీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం 365 రోజులు నిరంతరం సాధన చేయాలని, సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదన్నారు.గతంతో పోల్చుకుంటే క్రీడాకారులకు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయని తద్వారా క్రీడాకారులు ఎక్కువ సాధన చేసి రాష్ట్ర స్థాయిలో,జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు వచ్చేలా కృషి చేయాలన్నారు.షమీఉద్దీన్ కోచ్ ఎన్నో ఏళ్ళుగా తన శిక్షణలో వందలాది మంది యువతీ,యువకులను రాష్ట్ర,జాతీయ బాడీ బిల్డింగ్,పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి ఉందని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్, వై.శివసుబ్రమణ్యం,న్యాయవాది గోపికృష్ణ,మాలోత్ రాజా,ధారా నగేశ్,ఎలక్ట్రికల్ ఏడి రవి,ధర్మేందర్,లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.
Comment List