రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం

On
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం

కొత్తగూడెం,నవంబర్ 17(న్యూస్ఇండియా):చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో  రాజ మహమ్మద్ జాన్బీ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంలో రజాక్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సోమవారం మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిప్పనపల్లి పంచాయతీ లోని అహ్మద్ నగర్,వెంకటాపురం, తిప్పనపల్లి గ్రామాలకు చెందిన సుమారు 150 మంది రోగులను పరీక్షించి మందులను ఉచితంగా  అందజేశారు. శాస్త్ర చికిత్స అవసరమైన 15 మంది రోగులకు కంటి శాస్త్ర చికిత్స చేసేందుకు వెంటనే తమ వాహనంలో ఖమ్మం లోని మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. వారికి ఉచితంగా శస్త్ర చికిత్స చేయనున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా 2000 రూపాయలు విలువచేసే ఉచిత ఫ్యామిలీ ప్రివిలైజ్ కూపన్లను ఉచితంగా గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పీకే ఎం ఖాన్, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ట్రస్ట్ చైర్మన్ పాషా జునేడ్,ఐఎన్టియుసి సభ్యులు  కొమరయ్య, ఎస్కే గౌస్, సీతారామరాజు, మహేష్, రజాక్,వెంకటేశ్వర్లు పంచాయతీ సెక్రెటరీ సిహెచ్ శివ నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉపసర్పంచ్ ధరావత్ రామారావు, మచ్చా కుమార్, జాకీర్ హుస్సేన్, యాకూబాలి, ఆకుల రాంబాబు, మల్లికార్జున్, హాస్పిటల్  సిబ్బంది దేవేందర్, పాషా పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
కొత్తగూడెం,నవంబర్ 17(న్యూస్ఇండియా):చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో  రాజ మహమ్మద్ జాన్బీ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంలో రజాక్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సోమవారం మెగా కంటి వైద్య శిబిరం...
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ