రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత
సుజాతనగర్ ఎస్సై రమాదేవి
సుజాతనగర్(న్యూస్ ఇండియా ప్రతినిధి)జనవరి 19: సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుజాతనగర్ సెంటర్ వద్ద గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆర్రైవ్ అలివ్ ప్రోగ్రామ్ లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను( బ్లాక్ స్పోట్స్) ఆర్ & బి ఏ ఈ, ఏంవిఐ మానస, సుజాతనగర్ స్టేషన్ సిబ్బంది తో విసిట్ చేసి గుర్తించరు. రోడ్డు ప్రమాదాలు నివారించాల్సిన భాద్యత ప్రజలందరి మీద ఉంది. ఒక కుటుంబం లో ఒక వ్యక్తి మరణించడం అంటే అతను మన మధ్యనుండి వెళ్లిపోవడం కాదు ఒక కుటుంబం రోడ్డు మీద పడడం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి అందరి సగటు వయసు ఎక్కువగా 15 నుండి 40 లోపు వారే ఉన్నారు. దీనికి ప్రాథమిక కారణాలు హెల్మెట్ లేకపోవడం, అతి వేగం, మద్యం సేవించడం వంటివి ఉన్నాయి. పోలీస్ వారు వెహికల్ చెకింగ్ చేసి ఫైన్స్ విధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీస్ వారు పట్టుకున్న చాలా మంది వాహనదారులు మమ్మల్నిని శత్రువులుగా భావించే వద్దని, జాగ్రత్తగా గమ్యం చేరడం కోసం వారికి ఒక హేచ్చరికలాగా ఉండాలని మేము చెకింగ్ చేస్తాము. అంతే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశ్యం కాదు.దయచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు వ్యక్తి గతంగా భాద్యత వహించాలని అక్కడ విచ్చేసిన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

Comment List