ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం
తొర్రూరు పోలీస్
మహబూబాబాద్ జిల్లా :-
తొర్రూరు పట్టణం :
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా డీజీపీ అమలు చేస్తున్న “అరైవ్, అలైవ్” కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తొర్రూరు పోలీసు శాఖ కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.
ఈ సందర్భంగా తొర్రూరు పోలీసు (ఎస్ హెచ్ ఓ) జి ఉపేందర్ మాట్లాడుతూ…
రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్నదే “అరైవ్, అలైవ్” ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.
➡️ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
➡️ నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించాలి
➡️ మద్యం సేవించి వాహనం నడపకూడదు
➡️ వేగ నియంత్రణ పాటించాలి
➡️ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు
ప్రత్యేకంగా యువత రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్న నేపథ్యంలో…
తల్లిదండ్రులు, విద్యార్థులు, యువకులు బాధ్యతగా వ్యవహరించాలి అని సూచించారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగకుండా ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని,
“ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం
” అని తొర్రూరు పోలీసులు స్పష్టం చేశారు.

Comment List