అన్ని వసతులతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు..
మార్చిలోగా లబ్ధిదారులకు కేటాయింపు..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం అధికారులను ఆదేశించారు.
అన్ని వసతులతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు..
మార్చిలోగా లబ్ధిదారులకు కేటాయింపు..
సెప్టెంబరు నాటికల్లా పనుల పూర్తి..
కర్మన్‌ఘాట్‌లో వారం రోజుల్లో 80 ఫ్లాట్ల కేటాయింపు..
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతం ఆదేశాలు..
హైదరాబాద్, జనవరి 22, న్యూస్ ఇండియా ప్రతినిధి: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం అధికారులను ఆదేశించారు.
మార్చి నాటికల్లా కేటాయింపులు పూర్తి చేయాలని, సెప్టెంబరు నాటికల్లా అన్ని పనులు ముగించాలని స్పష్టం చేశారు. గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ కాలనీలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కర్మన్‌ఘాట్ నందనవనం కాలనీలో పునరావాసంలో భాగంగా నిర్మించిన రెండు బ్లాకుల్లోని 80 రెండు బెడ్‌రూమ్ ఫ్లాట్లను వారం రోజుల్లో లాటరీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణాలతో పాటు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతులను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు. కాలనీల్లో పాఠశాలలు, వైద్య సదుపాయాలు, పార్కులు, నిత్యావసర దుకాణాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మల్లాపూర్, కుర్మలగూడ, బాటసింగారం, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సమీక్షించిన ఎండీ, పనుల్లో జాప్యం తగదని హెచ్చరించారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లలో తప్పనిసరిగా నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఎం. చైతన్యకుమార్, పి. బలరాం, జి. విజయకుమార్, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డి. చాంప్లానాయక్, జీహెచ్‌ఎంసీ అధికారులు పి.వి. రవీందర్, మండలాల తహశీల్దార్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Comment List