గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..

On
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..

గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్, జనవరి 23 న్యూస్ ఇండియా ప్రతినిధి:

IMG-20260123-WA1853
తొర్రూరు గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూరు గ్రామంలో శుక్రవారం గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్ష ఎన్నిక జరిగింది. డైరెక్టర్ కో–ఆపరేటివ్ ఇన్‌స్పెక్టర్ వెంకట రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలో మాజీ వార్డు సభ్యులు నక్క శివలింగంను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నక్క శివలింగం మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను ఎల్లవేళలా కుల సభ్యుల శ్రేయస్సుకోసం నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో గౌడ కులానికి చెందిన ప్రతి కుటుంబానికి చేరవేస్తానని హామీ ఇచ్చారు. తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నక్క ప్రవీణ్, వైస్ చైర్మన్ బాలగోని శ్రీనివాస్, సెక్రటరీ నక్క కొండల, డైరెక్టర్ గౌని నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News