ఉద్యోగ మేళ
SBI లైఫ్ ఇన్సురన్స్ కంపెనీ లిమిటెడ్” లో ఉద్యోగాలు
మహబూబాబాద్, జూన్.4
డి.ఆర్.డి.ఏ-ఈ.జి.యం.యం మహబూబాబాద్ జిల్లా ఆద్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతి, యువకుల నుండి *”SBI లైఫ్ ఇన్సురన్స్ కంపెనీ లిమిటెడ్”* ప్రైవేట్ సంస్థలో డెవలప్మెంట్ మేనేజర్, టైపిస్ట్, ఆఫిస్ సబ్ ఆర్డినేటర్, విలేజ్ లైఫ్ మిత్రా ఉద్యోగాలకై ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ అర్హతతో 18 నుండి 45 సంవత్సరాల వయసులోపు యువతీ యువకులకు తేది. 10/06/2026 ఉ. 10:30 గం, లకు మహిళ మండల సమాఖ్య కార్యాలయం, అన్నారం క్రాస్ రోడ్, ZPSS High స్కూల్ ప్రక్కన, తొర్రూర్ నందు ముఖా-ముఖీ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయబడునని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూధనరాజు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
కావున అర్హత మరియు ఆసక్తి గల మహబూబాబాద్ జిల్లా గ్రామీణా ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులు తమ యొక్క బయోడేటా లేదా రేజ్యుం తో పాటు, విద్యార్హత ద్రువపత్రాలు జిరాక్స్ కాపీలతో తేది. 10.06.2026 భుధవారం రోజున ఉ. 10:30 గం, లకు. మహిళ మండల సమాఖ్య కార్యాలయం, అన్నారం క్రాస్ రోడ్, ZPSS High స్కూల్ ప్రక్కన, తొర్రూర్ నందు జరుగు ఉద్యోగ మేళా కు హాజరు కావలసిందిగా అధికారి తెలిపారు. వివరాల కొరకు శ్రీ. జి. గణేష్, జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్. మొబైల్ నెం. 8522054266 సంప్రదించగలరు.

Comment List