గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకు షాక్

On

ఎంఐఎం కి గుజరాతీలు షాకిచ్చారు. ఆయన పార్టీకి కేవలం 0.29 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ కేవలం 13 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో దించింది. అయితే వీరిలో చాలామందికి నోటా కన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. ఎంఐఎం టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో 12 మంది ముస్లిం అభ్యర్థులే. 2002 నుంచి మొదలుకుని ఎప్పుడు హిందుత్వ విషయాలు వచ్చినా ఎంఐఎం అధినేత బీజేపీపై, నరేంద్ర […]

ఎంఐఎం కి గుజరాతీలు షాకిచ్చారు. ఆయన పార్టీకి కేవలం 0.29 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి.

182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ కేవలం 13 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో దించింది.

అయితే వీరిలో చాలామందికి నోటా కన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. ఎంఐఎం టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో 12 మంది ముస్లిం అభ్యర్థులే.

2002 నుంచి మొదలుకుని ఎప్పుడు హిందుత్వ విషయాలు వచ్చినా ఎంఐఎం అధినేత బీజేపీపై, నరేంద్ర మోదీపై విరుచుకుపడుతుంటారు.

Read More సర్పంచి ఎన్నికల కంటే ముందే చెరుకుపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎన్నికలు

గుజరాత్ ముస్లింలకు తాము మద్దతుగా ఉంటామని ఒవైసీ జాతీయ మీడియా ద్వారా చెబుతుంటారు. అయితే గుజరాతీ ముస్లింలు మాత్రం ఒవైసీ పార్టీకి అండగా నిలబడలేదు.

Read More లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి ఆధ్వర్యంలో

అన్ని చోట్లా చిత్తుగా ఓడించారు. గుజరాత్ ముస్లింల మద్దతు తనకు తప్పకుండా ఉంటుందని ఆశించిన ఒవైసీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను మిగిల్చాయి.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News