మళ్లీ సారు , కారు, పదహారు…!

On

ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమా? అందుకే కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారా…? వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ సారు , కారు, 16 స్లోగన్ తో ప్రజల ముందుకు వెళ్తారా? ఇందుకోసం ఇప్పటి నుంచే కేసీఆర్ స్పీడ్ పెంచారా? తాజా పరిణామాలపై టిఆర్ఎస్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. :తెలంగాణ ఏర్పాటు తర్వాత గులాబీ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఇక మూడోసారి కూడా ఎగిరేది గులాబీ జెండానే అని కేసీఆర్ […]

ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమా? అందుకే కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారా…? వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ సారు , కారు, 16 స్లోగన్ తో ప్రజల ముందుకు వెళ్తారా? ఇందుకోసం ఇప్పటి నుంచే కేసీఆర్ స్పీడ్ పెంచారా? తాజా పరిణామాలపై టిఆర్ఎస్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది.

:తెలంగాణ ఏర్పాటు తర్వాత గులాబీ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఇక మూడోసారి కూడా ఎగిరేది గులాబీ జెండానే అని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.అభివృద్ధి సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపించడం ఖాయమని అధినేత కేసీఆర్ కు సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు విపక్షాల వైఫల్యాలు టీఆర్ఎస్కి పెద్ద అడ్వాంటేజ్ గా మారిందని భావిస్తున్నారు కేసీఆర్‌. అందుకే తిరుగులేని మెజారిటీతో వంద స్థానాలు తమదే అని పదేపదే చెబుతున్నారు.

అధికారంలోకి రావడం ఖాయమని డిసైడైనగులాబీ బాస్… దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు. గతంలోనే ఫెడరల్ ఫ్రంట్‌ తో రాష్ట్రాల పర్యటనలు చేశారు. గత లోల్‌సభ ఎన్నికల్లోనూ సారు, కారు, 16 స్లోగన్ తో జనంలోకి వెళ్లారు. కానీ దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావటం, టీఆర్ఎస్ కు అనుకున్న సీట్లు దక్కకపోవడంతో ఫెడరల్ ఫ్రంట్‌కు అప్పట్లో బ్రేక్ పడింది.

దేశంలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన కేసీఆర్… ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు ఇదే సరైన సమయని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది . అందుకే ప్రధాని మోదీ పై, కేంద్ర ప్రభుత్వం వైఖరిపై గత ఆరు నెలలుగా విరుచుకుపడుతున్నారు. బీజేపీని గద్దె దించే వరకు విశ్రమించేది లేదంటూ శపథం చేశారు.

Read More ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

అంతేకాక… దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క తాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేసినట్టే … ఇప్పుడు కూడా రాష్ట్రాల పర్యటనకు సిద్ధమయ్యారు. ముందుగా ముంబై, కర్ణాటక, ఢిల్లీ పర్యటనలు చేయనున్నారు. తనప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో… ఆయా ప్రాంతీయ పార్టీల అధినేత ముందు ఉంచనున్నారు కేసీఆర్‌.

పక్క ఎజెండాతో సీఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక, అన్ని వర్గాల నిర్లక్ష్యపు వైఖరినే ప్రధాన ఎజెండాగా రూపొందించినట్టు తెలుస్తోంది.

కేంద్ర నిర్ణయాలతో రాష్ట్రాలు ఎలా నష్టపోతున్నాయనది వివరిస్తారు. ఇప్పటికే మేధావులు, పలు సంస్థలు , ఇతరత్రా వ్యక్తులతో కేసీఆర్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది . అంతేకాకుండా దేశవ్యాప్తంగా పలు సర్వేలు కూడా చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కచ్చితంగా కొత్త కూటమి కి అవకాశం ఉందని కేసీఆర్ తేల్చుకున్నారు. అందుకే ఇదే సరైన సమయమని గులాబీ బాస్ భావిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది.

ఈసారి కేసీఆర్ ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతుందంటున్నారు టీఆర్ఎస్ నేతలు. అందుకే కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘనంగా నిర్వహించారు. దేశ్ కి నేత కేసీఆర్ అంటూ ఒక మెసేజ్ ను దేశవ్యాప్తంగా వినిపించే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కీలక భూమిక పోషించనున్నారు కేసీఆర్‌. ఆయన కింగ్ మేకర్ అవుతారంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా … కొత్త కూటమితో కేసీఆర్ ఢిల్లీ స్థాయిలో విజయం సాధిస్తారన్నది త్వరలో తేలనుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News