
అమ్మోరు తోట కాలనీలో ఘనంగా గణనాథుడి పూజలు
ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డ్ మెంబర్ తెల్లగమళ్ళ అనిత రవీందర్
వినాయక నవరాత్రులు పురస్కరించుకొని యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని అమ్మోరు తోట కాలనీలో బుదవారం గణనాథుడు పూజలో భాగంగా వార్డు సభ్యుడు తెల్లగమళ్ళ అనిత రవీందర్ కుటుంబ సభ్యులతో కలిసి గణేశుడి ప్రాణ ప్రతిష్ఠ, కలశ పూజలు నిర్వహించారు. అలాగే కాలనీలోని ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వాసులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాలను స్వీకరించారు.స్వామి వారికి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు చేసారు.ఆ విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాల నుండి విముక్తి కలిగించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రత్యేక కాలనీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ దయాకర్ , బండి ఆలేగ్జాండర్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీశైలం,సాహెద్,తేలగమళ్ళ పృద్వి, ప్రశాంత్ కాలనీ పెద్దలు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List