
విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు..
టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి..
వినాయక నవరాత్రి పురస్కరించుకొని మంగళవారం తుర్కయాంజల్ మున్సిపాలిటీ, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలు ఇందిరమ్మ కాలనీ, సూర్యవంశీ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, పెద్ద అంబేర్పెట్, అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన టిపిసిసి అధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గణనాథుడు రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ పసుల రాజేందర్ ముదిరాజ్, పండుగుల జయశ్రీరాజు, కందాడ అనుపమసుప్రసేన రెడ్డి, ఎస్సి సెల్ అధ్యక్షులు పంది పెంటయ్య, బీసీ సెల్ అధ్యక్షులు బుయ్య జ్ఞానేశ్వర్ గౌడ్, పెద్ద అంబేర్పెట్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేసారం జగన్ మోహన్ గౌడ్, పవన్ గౌడ్, మనీష్ గౌడ్, నీరజ్ గౌడ్, మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్. ఎస్.యు.ఐ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List