ప్రకాశం జిల్లా వాసి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక..
యర్రగొండపాలెం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన వి.శివ నాయక్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారు నిర్వహించిన తెలంగాణ స్టేట్ జ్యూడిషల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మరియు సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు.ఈయన బి.ఏ ఎల్ ఎల్ బి (గోల్డ్ మెడలిస్ట్) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారు.అదే విధంగా ఐ ఐ టి ఖరగ్ పూర్ యూనివర్సిటీ నుండి మాస్టర్ ఇన్ లా పూర్తి చేశారు. అలాగే వాషింగ్టన్ డీసీ స్కూల్ ఆఫ్ ఐ పి ఆర్ యూనివర్సిటీ నుండి "పేటెంట్ లా"సర్టిఫికేషన్ కోర్స్ పూర్తిచేశారు.అక్టోబర్ నెల 3 వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈయన తల్లిదండ్రులు ఎర్రగొండపాలెం పట్టణంకు చెందిన వి.హరినాయక్ (లైన్ మెన్, ప్రస్తుతం గిద్దలూరు లో విధులు నిర్వహిస్తున్నారు),తల్లి మంగమ్మ హరినాయక్ (గృహిణి),ఈయన పెద్ద అన్నయ్య వి.తిరుపతి నాయక్ కూడా అడ్వకేట్ గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు.
Comment List