సచివాలయ ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు

బందెల దొడ్డి బజార్,క్లబ్ రోడ్డు సచివాలయ ఉద్యోగస్తులకు మెమోలు జారీ

On
సచివాలయ ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు

గిద్దలూరు న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో బందెల దొడ్డి బజార్ .,క్లబ్ రోడ్డు సచివాలయాలు యందు విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది మధ్యాహ్న సమయంలో తరచుగా సచివాలయం తాళాలు వేస్తున్నందున పలు అవసరాల నిమిత్తం సచివాలయం కు వచ్చే ప్రజలు అసౌకర్యంగా వెను తిరిగి వెళుతున్నారని ఈ విషయంపై ప్రజలు నగర పంచాయతీ కార్యాలయంకు ఫిర్యాదు చేయగా గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వై రామకృష్ణయ్య వెంటనే స్పందించి విధుల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్న బందెల దొడ్డి బజార్,క్లబ్ రోడ్డు సచివాలయ ఉద్యోగస్తులకు మెమోలు జారీ చేశారు.ఈ సంధర్బంగా వై రామకృష్ణయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిందని కావున నగర పంచాయతీ పరిధిలో ప్రతి ఒక్క వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా సమయానికి విధులకు హాజరు కావాలని అలాగే సచివాలయ పని దినంలో ఫీల్డ్ వెరిఫికేషన్ కు వెళ్లే సమయంలో ఖచ్చితంగా మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగస్తులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఈ విధంగా మరలా పునర్రావృతమైతే సిసిఎ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుందని తెలియజేసారు..

IMG-20230927-WA0275
నగర పంచాయతీ కమిషనర్ రామకృష్ణయ్య..
Views: 226
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???