
టేక్మాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీల వాల్ పోస్టర్ ను సిడబ్ల్యుసి సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల మేరకు టేక్మాల్ మండలం కేంద్రంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ అధ్యక్షతన మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ గారు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మ రమేష్ గారు మాట్లాడుతూ రాబోవు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ప్రజల సంక్షేమాన్ని దృష్టి లో ఉంచుకొని అద్భుతమైన ఆరు గ్యారంటీలను ప్రకటించిందని తెలిపారు. కార్యకర్తలు బూత్ స్థాయిలో గ్యారంటీలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజుగౌడ్ , జిల్లా మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు షైక్ మజహర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్, మండ కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్, సాయిబాబు, కిషోర్, ఎస్టి సెల్ అధ్యక్షులు సేవాలాల్ , నాయకులు రాజు చంద్రయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List