నకిరేకల్ ఎమ్మెల్యే గా పోటీచేస్తున్న..

మేడి నరేష్..

On
నకిరేకల్ ఎమ్మెల్యే గా పోటీచేస్తున్న..

IMG-20231012-WA0955
మేడి నరేష్..

చిట్యాల మండలం వనిపాకల గ్రామం కి చెందిన మేడి నరేష్ సీనియర్ జర్నలిస్ట్, నకిరేకల్  ఎమ్మెల్యే గా , భువనగిరి  ఎంపీ గా పోటీచేసిన వ్యక్తినని  అనునిత్యం పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటు పడే వ్యక్తిగా , నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ వస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో కూడా మేడి నరేష్ నకిరేకల్ ఎమ్మెల్యే గా పోటిచేయడం జరుగుతుందని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గం లోని పల్లె , పల్లెకు వెళ్లి  ప్రజలతో కలిసి అవినీతి ,అక్రమాలకు పాల్పడ్డ వారి ఆగడాలు బయటపెడుతానని అన్నారు. ఈ సందర్భంగా మేడి నరేష్ మాట్లాడుతూ 4 కోట్ల ప్రజలను మోసం చేసి మాయ మాటలతో కేసిఆర్ రెండు సార్లు అధికారం లో రావడం జరిగింది. తెలంగాణ హామీల కే పరిమితం అయ్యింది తప్ప అమలుకు నోచుకున్న పాపాన పోలేదు . విద్యార్ధులు భవిష్యత్తును , విద్య వ్యవస్థను   నాశనం చేశాడు, బీఆరేస్ రాక్షస రాజకీయ నాయకుల కోసం రైతు బంద్ ను వాడుకొని వేల కోట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ,మంత్రులకు,   రైతన్నలకు కేవలం 10 వేలు ఇచ్చి రైతు బంద్ పేరుతో  మోసం చేసిన చరిత్ర కేసిఆర్ ది. తెలంగాణ వస్తె నీళ్ళు , నిధులు , నియామకాలు అన్న కేసిఆర్ , నీళ్ళు ,నియామకాల ఊసే లేదు, తెలంగాణకు దళితుడు ముఖ్యమంత్రి అని , 3 ఎకరాల భూమి అని, డబల్ బెడ్ రూం ఇళ్లు అని మోసాలు చేసిన కేసిఆర్ ప్రభుత్వం , దళితులను క్యాబినెట్ లో లేకుండా అవమానం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కింది. అదే విధంగా తెలంగాణ అమవీరుల కుటుంబాలకు కూడా ఒక్కరికీ న్యాయం జరగలేదు. తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కు కనీసం నామినేటెడ్ పదవి ఇవ్వలేక కుట్ర చేసిన కేసిఆర్ , నిరుద్యోగులకు నోటిఫికేషన్లు కరవు , కేవలం 1% ఉన్నోడు రాజ్యం ఏలడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ , ఓబీసీ లను రాజకీయంగా విస్మరించిన కేసిఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ మంత్రులకు , ఎమ్మెల్యేలకు ప్రాజెక్ట్ ల పేరుతో కాంట్రాక్టులు, కమీషన్లు , కూటికి లేకుండా నేటికీ బలహీన వర్గాలు,భారత దేశం లో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ను ఇప్పుడు అప్పుల ఊబిలోకి తీసుకుపోయిన  కేసిఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయం కేవలం 25  సీట్లకు మించకుండా పోవడం , ఓటమి పాలవడం జరుగుతుందని అన్నారు . నకిరేకల్ నియోజకవర్గం విషయానికొస్తే అవినీతి అనేదే లేకుంటే  మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే  ఎకరాల కొద్దిగా భూమి ఎక్కడి నుంచి వచ్చింది , జిఎంఆర్ సంస్థ ఇచ్చిన ఇల్లు, హైదరాబాద్ లో ఇళ్లు , పక్క రాష్ట్రాల్లో కాంట్రాక్టులు, స్మశాన వాటికలు కబ్జాలు , ఇవ్వన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి , ఎమ్మెల్యే లేక ముందు మీ అస్తులెన్ని ఇప్పుడు ఎన్ని ఉన్నాయి .  దమ్ముంటే చర్చకు రండి అని ప్రశ్నించారు. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారిని చిత్తు చిత్తుగా నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు ఓడించడం ఖాయం అని ఈ సందర్భంగా మేడి నరేష్ మాట్లాడారు . ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెల్లడం ఏంటి సంస్కృతి అని విమర్శించారు. ఏది ఏమైనా అక్రమాలకు పాల్పడ్డ దొంగలకు బుద్ది చెప్పాల్సిందే అన్నారు. గ్రామ గ్రామానికి వెళ్లి  అవినీతి ,అక్రమాలను బట్ట బయలు చేసి ఓటమి పాలయ్యే వరకు ఊరుకునేది లేదని  నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి నరేష్ హెచ్చరించారు.  తాను బలహీన వర్గాల పక్షాన ఎల్లప్పుడూ కొట్లాడే గొంతుగా ఉంటానని అన్నారు. అతి త్వరలో 2 రోజుల్లో నకిరేకల్ నియోజక వర్గం లో భారీ ర్యాలీ అనంతరం మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని తెలిపారు.

Views: 16

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక