వడ్డీతో చెల్లిస్తాము వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ

On
వడ్డీతో చెల్లిస్తాము వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ

ఉమ్మడి మెదక్ జిల్లా మునిపల్లి మండలం న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది  కాంగ్రెస్ పార్టీయేనని  మాజీ డిప్యూటీ సీఎం, సీడబ్ల్యుసీ మెంబర్  దామోదర రాజనర్సింహఅన్నారు. గురువారం మండలంలోని  అల్లాపూర్,   తాటిపల్లి  గ్రామానికి  చెందిన  కొంతమంది ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..  బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఎవరూ అధైర్య పడొద్దన్నారు.  6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీశ్ కుమార్,   మాజీ ఎంపీపీలు   రాంరెడ్డి,  రాజేశ్వర్ రావు,   ఎంపీటీసీ పాండు,  మాజీ ఎంపీటీసీలు సుధాకర్ రెడ్డి, యాదయ్య,   తాటిపల్లి సర్పంచ్ అంజిరెడ్డి,   పార్టీ మండల యూత్ అధ్యక్షుడు  రాజు, నర్సింహ్మ గౌడ్, నరేందర్ గౌడ్, రహీం,  సంగమేశ్వర్ ఉన్నారు

Views: 460
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News