చౌటుప్పల్ లో ఘనంగా దసరా వేడుకలు
శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు -భారీగా తరలివచ్చిన భక్తులు
విజయదశమి సందర్భంగా చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు. చౌటుప్పల్ ఏసిపి మొగిలయ్య. సిఐ దేవేందర్ ముఖ్యఅతిథిలుగా పాల్గొని జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు, రావణాసురుడి చిత్రపటం దహనం చేసి ఒకరినొకరు శని పత్రాన్ని ఇచ్చి పుచ్చుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు దుర్గమాత విగ్రహాలకు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కోలాటాలు, భజనలు, యువత ఆనందోత్సవాల మధ్య టపాసుల మోతతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, మంచిగంటి భాస్కర్ గుప్త, సోమవారం సత్తయ్య, దాచేపల్లి శ్రీనివాస్, పాలడుగు వెంకటేష్, కామిశెట్టి శ్రీదేవి, రమాదేవి, రజిత, వర్ష, సంధ్య, ఆయా ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List