చౌటుప్పల్ లో ఘనంగా దసరా వేడుకలు

శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు -భారీగా తరలివచ్చిన భక్తులు

On
చౌటుప్పల్ లో ఘనంగా దసరా వేడుకలు

విజయదశమి సందర్భంగా చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు. చౌటుప్పల్ ఏసిపి మొగిలయ్య. సిఐ దేవేందర్ ముఖ్యఅతిథిలుగా పాల్గొని జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు, రావణాసురుడి చిత్రపటం దహనం చేసి ఒకరినొకరు శని పత్రాన్ని ఇచ్చి పుచ్చుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు దుర్గమాత విగ్రహాలకు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కోలాటాలు, భజనలు, యువత ఆనందోత్సవాల మధ్య టపాసుల మోతతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, మంచిగంటి భాస్కర్ గుప్త, సోమవారం సత్తయ్య, దాచేపల్లి శ్రీనివాస్, పాలడుగు వెంకటేష్, కామిశెట్టి శ్రీదేవి, రమాదేవి, రజిత, వర్ష, సంధ్య, ఆయా ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.IMG-20231024-WA0084IMG-20231024-WA0089

Views: 78

Post Comment

Comment List

Latest News

గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని చింతలపల్లి రోడ్డు శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో...
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..