వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారా.. ఈ 10 విషయాలు తెలుసా?

WhatsApp Channel Facts : మరి ఈ విషయాలు మీకు తెలుసా..?

By Teja
On

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇటీవల ఛానల్ పీఛర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి.. మీరు కూడా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా..? మరి ఈ విషయాలు మీకు తెలుసా..?

వాట్సాప్‌ ఛానల్‌ అంటే ఏమిటంటే (What is WhatsApp Channel ) : వాట్సాప్‌ను ఇన్నాళ్లూ మనం పరస్పర కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే వాడేవాళ్లం. ఆ తర్వాత గ్రూప్స్‌ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ ఛానెల్స్‌. ఈ సరికొత్త ఫీచర్‌ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. అచ్చం ట్విటర్‌, ఇన్‌స్టా(Instagram)లో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో.. అలా అన్నమాట. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే.. మీరు ఫాలో అయినంత మాత్రానా మీ ఫోన్‌ నంబర్‌ ఎవరికీ కనిపించదు.
How To Create And Customize Your Own WhatsApp Channel – W3era

ఎవరైనా WhatsApp ఛానల్‌ని క్రియేట్ చేసుకోవచ్చా? ఇంతకుముందు ప్రభావవంతమైన వ్యక్తులు, ప్రముఖులు, బ్రాండ్‌లు లేదా కంపెనీలు, వార్తల ప్రచురణలు మొదలైనవాటి ద్వారా ఆహ్వానించబడిన కొంతమంది వినియోగదారులకు WhatsApp ఛానల్‌ని సృష్టించడం పరిమితం చేసింది. ఇప్పుడు వినియోగదారులందరూ WhatsApp ఛానల్‌ని సృష్టించుకోవచ్చు.

ఛానల్​ని ఎలా క్రియేట్‌ చేయాలి (How To Create WhatsApp Channel): మొదట మీరు వాట్సాప్ ఓపెన్ చేసి.. అందులో ఛానల్స్‌ పక్కనే ఉన్న ప్లస్‌ సింబల్‌ క్లిక్‌ చేస్తే క్రియేట్‌ ఛానల్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. తర్వాత డీపీ, ఛానల్‌ పేరు, ఛానల్‌ డిస్క్రిప్షన్‌ పేర్కొని సింపుల్‌గా మీ వాట్సాప్ ఛానల్‌ క్రియేట్‌ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన వారికి ఆ లింక్‌ను షేర్‌ చేయండి.

మీకు నచ్చినవారిని ఫాలో అవ్వండిలా.. మీకు వాట్సప్‌లో ఛానల్స్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చి ఉంటే.. స్టేటస్‌ (Status) ట్యాబ్‌ స్థానంలో అప్‌డేట్స్‌ (Updates)అని కనిపిస్తుంది. అక్కడ పై భాగంలో స్టేటస్‌లు కనిపిస్తాయి. దిగువన ఛానెల్స్‌ కనిపిస్తాయి. దిగువన మీకు ఫైండ్‌ ఛానెల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ మీరు ఫాలో అవ్వాలనుకుంటున్న వారి పేరు సెర్చ్ చేస్తే.. వారి ఛానల్ (క్రియేట్ చేసుకుని ఉంటే) కనిపిస్తుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న ప్లస్‌ (+) సింబల్‌ క్లిక్‌ చేయడం ద్వారా మీరు వారి ఛానల్‌ను ఫాలో అవ్వొచ్చు.

WhatsApp ఛానెల్‌లో ఎలాంటి సందేశాలు Share చేయవచ్చు?

వాట్సాప్ ఛానల్ అనేది.. అడ్మిన్​కు మాత్రమే సంబంధించిన వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్. కాబట్టి.. ఫాలోయర్‌లు ఎలాంటి మెసేజ్‌లనూ పంపలేరు. అడ్మిన్ మాత్రమే సెండ్ చేయగలరు. టెక్స్ట్, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, ఎమోజీలు, GIFలు, పోల్‌లను పంపగలరు. భవిష్యత్తులో ఛానల్‌కు WhatsApp చెల్లింపు సేవల ఆప్షన్​ కూడా వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్‌కు బహుళ అడ్మిన్‌లు ఉండవచ్చా?

ఛానల్​కు ఎక్కువ మంది అడ్మిన్​లను జోడించడానికి అవకాశం ప్రస్తుతానికి లేదు. భవిష్యత్తులో ఛాన్స్ రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఛానల్​లో చేరకుండానే అప్‌డేట్‌లను చూడవచ్చా?

వాట్సాప్​ ఛానల్‌లో చేరాలా..? లేదా అనుసరించాలా..? అన నిర్ణయించుకోవడానికి ముందు.. వినియోగదారులు 30 రోజుల వరకు ఛానల్ నుంచి అప్‌డేట్‌లను చూడగలరు. ఛానల్ నుంచి వచ్చే సందేశాలు 30 రోజుల వరకు WhatsApp సర్వర్‌లలో నిల్వ ఉంటున్నందున.. 30 రోజులకు పరిమితమైన వాటినే మీరు చూడగలరు.

మిమ్మల్ని ఇతరులు చూడగలరా?

ఒక ఛానల్​లోని ఫాలోయర్స్ ప్రైవేట్‌గా ఉంచబడతారు. అందువల్ల.. ఇతర ఛానల్ సభ్యులు మిమ్మల్ని, మీ పరస్పర చర్యను, మీ పేరు, ఫోన్ నంబర్, ప్రొఫైల్ పిక్, ఛానల్ కంటెంట్‌కి ప్రతిస్పందనలు లేదా పోల్​లో మీరు దేనికి ఓటు వేస్తున్నారు? అనే వివరాలను చూడలేరు. అయితే.. ఛానల్​ అడ్మిన్ మీ కార్యాచరణను కొంత వరకు చూడగలరు. కానీ.. మీరు ఏయే ఛానెల్​లో చేరారో ఆ కాంటాక్ట్స్​ ను మాత్రం చూడలేరు.

ఛానల్ సభ్యులు అడ్మిన్ వివరాలను చూడగలరా?

ఛానల్ అడ్మిన్​ పేరు, ఫోన్ నంబర్, ప్రొఫైల్ పిక్, ఇతర సమాచారం వంటి అడ్మిన్ వివరాలన్నీ.. సీక్రెట్​గానే ఉంటాయి. ఆన్​లైన్​ గోప్యతా సమస్యల కారణంగా అవి కనిపించవు. అంటే.. అడ్మిన్ వివరాలను ఎవరూ చూడలేరు అన్నమాట.

ఛానల్ అడ్మిన్‌కు ఎలాంటి అధికారాలు, బాధ్యతలు ఉంటాయి?

  • ఛానల్‌కు సభ్యులను యాడ్​చేయవచ్చు.
  • మీ నంబర్ సేవ్ అయి ఉన్న ఛానల్ అడ్మిన్​.. మీ పేరు, ఫోన్ నంబర్‌, ప్రొఫైల్ ఫొటో వంటివి చూడగలరు.
  • కాంటాక్ట్​ నంబర్​ తనవద్ద లేని అడ్మిన్​.. పరిమిత సమాచారాన్ని మాత్రమే చూడగలరు.
  • ఛానెల్ అడ్మిన్.. Followersకు సెక్యూరిటీ కల్పించడానికి బాధ్యత వహిస్తారు.
  • ఛానల్​ను సురక్షితంగా ఉంచడానికి WhatsApp ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి.
  • WhatsApp నిబంధనలకు విరుద్ధంగా ఉండే కంటెంట్​పై.. వాట్పాప్​కు కంప్లైట్ చేయవచ్చు.
Views: 179

About The Author

Post Comment

Comment List

Latest News