ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ పార్టీకి షాక్...

On
ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ పార్టీకి షాక్...

పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ సిద్ధాంకి కృష్ణ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరినారు.

ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీకి షాక్..

అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 29 (న్యూస్ ఇండియా తెలుగు): అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్ సిద్ధాంకి కృష్ణ రెడ్డి ని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, సిడబ్ల్యూసి మెంబర్ వంశీ చందర్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సిద్ధంకి కృష్ణారెడ్డి తో పాటు తన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా సిద్ధాంకి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మల్ రెడ్డి రంగారెడ్డికి పెద్ద అంబర్పేట్ లో 3000 మెజార్టీ తీసుకొస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్ గౌడ్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం జెడ్పిటిసి మహిపాల్ రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, దండెం రాజశేఖర్ రెడ్డి, అయ్యప్ప రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

IMG20231029102436
కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి
Views: 195

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..